AP Corona Cases: ఏపీలో కొత్తగా 1627 కరోనా కేసులు..

AP Corona Cases
X

AP Corona Cases 

AP Corona Cases: గడిచిన 24 గంటల్లో 1,627 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 57,672 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యా శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1,627 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 57,672 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యా శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19,56,392కి పెరిగింది. తాజాగా 17 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 13,273కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 21,748 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. గడిచిన 24 గంటల్లో 2,017 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయినట్లు వెల్లడించింది. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు, నెల్లూరు, పశ్చిమగోదావరి, కడప జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు.



Tags

Next Story