ఏపీలో కొత్తగా 1,535 పాజిటివ్ కేసులు..16 మరణాలు

ఏపీలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన గడిచిన 24 గంటల్లో 1,535 కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్ వల్ల 16 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.రాష్ట్ర వ్యాప్తంగా 69,088 పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,92,191 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,631కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,55,95,949 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. 24 గంటల వ్యవధిలో 2,075 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,60,350కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,210 యాక్టివ్ కేసులున్నాయి.
#COVIDUpdates: 14/08/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) August 14, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,89,296 పాజిటివ్ కేసు లకు గాను
*19,57,455 మంది డిశ్చార్జ్ కాగా
*13,631 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 18,210#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/vzJo2caeVq
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com