Tirumala : తిరుమలలో కొత్త డిక్లరేషన్ .. వివరాలు ఇవే

Tirumala : తిరుమలలో కొత్త డిక్లరేషన్ .. వివరాలు ఇవే
X

తిరుమల కొండ అంతటా అన్యమతస్తుల డిక్లరేషన్ పై కొత్త బోర్డులు వెలశాయి. టీటీడీ నిబంధనలు తెలియజేస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే మార్గాల్లో కొత్తగా ఫ్లెక్సీలు, బోర్డులు, పోస్టర్లు ఏర్పాటు చేసింది టీటీడీ. హైందవేతరుల ప్రవేశంపై నిబంధనలు చెబుతూ డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేసింది. హైందవేతరులు ఆలయ ప్రవేశం చేయాలంటే.. డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాలని టీటీడీ ముందస్తు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. శ్రీవారి ఆలయ ప్రవేశం హిందువుల హక్కని.. టీటీడీ ఆలయాలు హిందువులకు మాత్రమే అంటూ బోర్డులు పెట్టింది టీటీడీ. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అన్ని ఉప విచారణ కార్యాలయాలు, రిసెప్షన్ కార్యాలయం, అదనపు కార్యనిర్వాహరణాధికారి క్యాంప్ కార్యాలయం తదితర ప్రాంతాల్లో ఈ ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది టీటీడీ. అయితే అనూహ్యంగా జగన్ పర్యటన రద్దు కావడంతో మళ్లీ ఆ బోర్డులను తోలగించారు.

Tags

Next Story