AP Liquor Policy : ఒకటో తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ

ఏపీలో అక్టోబర్ ఒకటి నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో నూతన మద్యం పాలసీ రూపకల్పనపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా నూతన మద్యం విధానం రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలిసారిగా భేటీ అయ్యింది. మంగళగిరి ఆటోనగర్లోని SEB కార్యాలయంలో కొల్లు రవీంద్ర అధ్యక్షతన నూతన మద్యం కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై చర్చించింది. మంత్రులు గొట్టిపాటి రవి, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మద్యం పాలసీపై సమీక్షించారు.
కల్తీ మద్యం నుండి ప్రజలకు విముక్తి కల్పించడమే లక్ష్యంగా నూతన మద్యం పాలసీ రూపొందిస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన పిచ్చి మద్యం బ్రాండ్ల కారణంగా యువత గంజాయి, డ్రగ్స్ వైపు వెళ్లారని మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com