AP : వైసీపీ హయాంలో శాంతిభద్రతలు లేవు : చంద్రబాబు

వైసీపీ హయాంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ నేతలను అక్రమ కేసులతో జైల్లో పెట్టి వేధించారని ఆరోపించారు. జేసీ ప్రభాకర్-66, చింతమనేని ప్రభాకర్-48, పులివర్తి నాని-31, దేవినేని ఉమ-27, నిమ్మల రామానాయుడు-20, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి-19, చంద్రబాబు-17, లోకేశ్-17. జీవీ ఆంజనేయులు-17, పరిటాల శ్రీరామ్-15, అచ్చెన్నాయుడుపై 12 కేసులు నమోదు చేశారని సీఎం అసెంబ్లీలో తెలిపారు.
ఒకప్పుడు హైదరాబాద్‌లో 30రోజుల పాటు కర్ఫ్యూ విధించే పరిస్థితులు వచ్చేవని సీఎం చంద్రబాబు అన్నారు. తరచూ మత ఘర్షణలు జరిగేవని, వాటిని టీడీపీ అణచివేసిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారిందని తెలిపారు. రాయలసీమలోనూ ఫ్యాక్షనిజం లేకుండా చేశామన్నారు. ఏపీలో మావోయిస్టులను నియంత్రించామని పేర్కొన్నారు. అసెంబ్లీలో ఆయన శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చేశారు.
అసెంబ్లీలో రేపు ఆర్థికశాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. 2019-24 మధ్య ₹1,41,588 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించింది. పెండింగ్ బిల్లుల్లో ₹93,000 కోట్లు CFMSలోకి అప్‌లోడ్ చేయలేదని, ₹48,000 కోట్ల బిల్లులు అప్‌లోడ్ చేసినా చెల్లింపులు చేయలేదని తెలిపింది. నీటి పారుదల శాఖ, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లుల పూర్తి వివరాలను శ్వేతపత్రంలో వెల్లడించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com