Visakhapatnam: 40 ఏళ్లుగా లేని రోడ్లు.. ఇళ్లల్లోనే మహిళలకు ప్రసవాలు..

Visakhapatnam (tv5news.in)
X

Visakhapatnam (tv5news.in)

Visakhapatnam: విశాఖ మన్యంలో గిరిజనుల కష్టాలు అన్నిఇన్ని కావు. రోడ్డు సౌకర్యం లేక ప్రాణాలు పోతున్నాయి.

Visakhapatnam: విశాఖ మన్యంలో గిరిజనుల కష్టాలు అన్నిఇన్ని కావు. రోడ్డు సౌకర్యం లేక ప్రాణాలు పోతున్నాయి. ఓ గర్భిణికి పురుటి నొప్పులు రావడంతో 108కి ఫోన్‌ చేశారు. అయితే.. రోడ్లు సరిగా లేకపోవడంతో రాలేని పరిస్థితి. దీంతో నొప్పులు ఎక్కువ కావడంతో ఇంటి వద్దే పాపకు జన్మనిచ్చి తనువుచాలించింది దివ్య అనే మహిళ. చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ పరిధిలోని ఎదరుపల్లి గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతురాలు దివ్యకు ఇది నాలుగో సంతానం.

పురుటి నొప్పులు వచ్చిన మహిళలను మంచాలు, డోలిలో మోసుకెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కె.శనివారం పంచాయతీ పరిధిలోని మామిడి గ్రామంలో ఓ గర్భిణికి నొప్పులు రావడంతో మంచంపై ఉంచి మోసుకుంటూ తీసుకెళ్లారు. 40 ఏళ్లుగా తమ గ్రామానికి రోడ్లు లేవని స్థానికులు వాపోతున్నారు. ఏ పరిస్థితి వచ్చినా నడుకుంటూ గుట్టల రాళ్ల మధ్య వెళుతున్నామని తెలిపారు.

Tags

Next Story