REVANTH: జగన్‌పై రేవంత్‌ పరోక్ష విమర్శలు

REVANTH: జగన్‌పై రేవంత్‌ పరోక్ష విమర్శలు
వైఎస్సార్ ఆశయాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఆయన వారసులు ఎలా అవుతారని ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరుగుతున్నా పాలకులు ఢిల్లీలో నోరెత్తడం లేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మైదానంలో జరిగిన కాంగ్రెస్ న్యాయసాధన సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రాజధాని, పోలవరం పూర్తి కాకపోయినా ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ప్రజలకు దగా చేసే ప్రభుత్వాలను గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఎవరో వచ్చి విశాఖ ఉక్కును అమ్ముతామంటే తెలుగువారిగా ఊరుకునేది లేదన్నారు. కలిసి కట్టుగా పోరాడదామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై జగన్ కుట్ర పన్నుతున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.


వైఎస్సార్ ఆశయాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఆయన వారసులు ఎలా అవుతారని రేవంత్ రెడ్డి నిలదీశారు. జగన్ పేరెత్తకుండానే ఆయనపై విమర్శల వర్షం కురిపించారు. ఏపీకి కావల్సింది పాలకులు కాదని, ప్రశ్నించే గొంతుకలను అన్నారు. అలాగే ఢిల్లీలో ఉన్న మోదీ ఏపీని శాసించాలని అనుకుంటున్నారని అన్నారు. ఢిల్లీని అడిగి మనకు కావాల్సినవి తెచ్చుకునే నాయకులు ఇక్కడ లేరని చెప్పారు. విశాఖలో ఈ సభను చూస్తుంటే హైదరాబాద్‌లో సభ జరుగుతున్నట్టు ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఏపీలో ప్రశ్నించే గొంతుకలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ హయాంలో రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఆయన చెప్పారు. ఆరోగ్య శ్రీ తీసుకువచ్చి చాలా మంది పేదల ప్రాణాలు కాపాడరని పేర్కొన్నారు. పేద పిల్లల చదువు కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ తీసుకొచ్చారని గుర్తు చేశారు. అలాగే అన్ని ఆలోచించే షర్మిల ఏపీకి వచ్చారని చెప్పారు.

‘‘విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ రక్షణ కోసం షర్మిల నడుం బిగించారు. ఉక్కు సంకల్పంతో సభ పెట్టారు. వైఎస్‌ఆర్‌ సంకల్పాన్ని నిలబెట్టే వారే ఆయన వారసులవుతారు. ఏపీ ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెట్టారు. ప్రశ్నించే నాయకుడు లేకే ప్రధాని మోదీ ఏపీని పట్టించుకోవడం లేదు. దిల్లీని డిమాండ్‌ చేసి.. కావాల్సింది సాధించుకునే నాయకత్వం ఇప్పుడు లేదు. అందుకే పదేళ్లయినా ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదు.. పోలవరం పూర్తి కాలేదు.

Tags

Read MoreRead Less
Next Story