AP Nominations : ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 3644 నామినేషన్లు

AP Nominations : ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 3644 నామినేషన్లు
X
అత్యధికంగా తిరుపతిలో 52 నామినేషన్లు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తైన తర్వాత 2వేల 705 నామినేషన్లు ఆమోదించినట్టు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలకు 3వేల 644 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 2705 నామినేషన్లు ఆమోదం పొందినట్టు ఈసీ వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 939 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినట్టు వెల్లడించింది ఈ ఎన్నికల్లో అత్యధికంగా తిరుపతి శాసనసభ స్థానానికి 52 నామినేషన్లు దాఖలవగా అత్యల్పంగా చోడవరం నియోజవర్గంలో 8 నామినేషన్లు దాఖలయ్యాయి. ఏపీలోని 25 లోక్ సభ స్థానాలకు 686 నామినేషన్లు దాఖలు కాగా 503 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. 183 మంది నామినేషన్లను ఈసీ తిరస్కరించింది. గుంటూరు లోక్ సభ స్థానానికి అత్యధికంగా 47 నామినేషన్లు దాఖలైతేశ్రీకాకుళంలో 16 నామినేషన్లు వచ్చాయి. ఈనెల 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత... అభ్యర్ధుల తుదిజాబితాను ఈసీ ప్రకటించనుంది.

రాష్ట్రంలోని లోక్ సభ స్థానాలకు సంబంధించి అత్యధికంగా గుంటూరుపార్లమెంట్ స్థానానికి 47 నామినేషన్లు, అత్యల్పంగా శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గానికి 16 నామినేషన్లు దాఖలు అయ్యాయని సీఈవో ముకేష్ కుమార్ మీనా తెలిపారు. నామినేషన్ల ఆమోదం విషయంలో అత్యధికంగా 36 నామినేషన్లు నంద్యాల పార్లమెంట్ స్థానానికి, అత్యల్పంగా 12 నామినేషన్లు రాజమండ్రి లోక్ సభ స్థానానికి ఆమోదించినట్లు తెలిపారు.

అదేవిధంగా శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి అత్యధిక మొత్తంలో తిరుపతి అసెంబ్లీ స్థానానికి 52 నామినేషన్లు, అత్యల్పంగా 8 నామినేషన్లు చోడవరం అసెంబ్లీ నియోజకవర్గానికి దాఖలు అయ్యాయని తెలిపారు. నామినేషన్ల ఆమోదం విషయంలో అత్యధికంగా 48 నామినేషన్లు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి, అత్యల్పంగా 6 నామినేషన్లు చోడవరం అసెంబ్లీ స్థానానికి ఆమోదించినట్లు ప్రకటించారు. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందని, నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులు మినహా మిగిలిన వారు మే 13న జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులుగా పరగణిస్తామని సీఈవోపేర్కొన్నారు.

Tags

Next Story