AP: లోక్‌సభకు 731.. అసెంబ్లీకు 4వేలకుపైగా..

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు తెరపడింది. చివరిరోజు నామపత్రాలు సమర్పించేందుకు అభ్యర్థులు పోటెత్తారు. కార్యకర్తలతో కలిసి... భారీ ర్యాలీగా వెళ్లి... నామినేషన్లు వేశారు. లోక్ సభకు 731, అసెంబ్లీకి 4 వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరగనుంది.
NTR జిల్లా జగ్గయ్యపేట కూటమి అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య నామినేషన్ వేశారు. విజయవాడ లోక్‌సభ కూటమి అభ్యర్థి కేశినేని చిన్నితో కలిసి... ర్యాలీగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు. బాపట్ల జిల్లా చీరాల అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా ఎం.ఎం. కొండయ్య అట్టహాసంగా నామినేషన్ వేశారు. వినాయకుడి ఆలయం నుంచి ప్రముఖ సినీ నటుడు నిఖిల్ సిద్ధార్థతో కలిసి... ర్యాలీగా వెళ్లి... నామపత్రాలు సమర్పించారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు కూటమి అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ నామినేషన్ దాఖలు చేశారు. అమరావతిలో అంబేడ్కర్ కూడలి నుంచి భారీ ర్యాలీ నిర్వహించగా... ముహుర్త సమయం మించిపోవడంతో ప్రవీణ్ మధ్యలోనే ప్రచార రథం దిగి... ఆగమేఘాల మీద వెళ్లి నామపత్రాలు సమర్పించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబు నామినేషన్ వేశారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం కూటమి అభ్యర్థిగా కందుల నారాయణరెడ్డి.... భారీ ర్యాలీగా వెళ్లి.... నామినేషన్ వేశారు. ఒంగోలు లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా ఈద సుధాకర్ రెడ్డి నామినేషన్ వేశారు. నెల్లూరు అర్బన్ వైకాపా అభ్యర్థి ఖలీల్ నామినేషన్ దాఖలు చేశారు. YSR జిల్లా ప్రొద్దుటూరు కూటమి అభ్యర్థి వరదరాజులరెడ్డి ఎలాంటి ఆర్భాటం లేకుండా నామినేషన్ దాఖలు చేశారు. అనంతపురం జిల్లా శింగనమల కూటమి అభ్యర్థిగా బండారు శ్రావణిశ్రీ... ఎద్దుల బండిపై వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. మరువకొమ్మ క్రాస్ నుంచి కార్యకర్తలతో కలిసి... భారీ ర్యాలీగా వెళ్లి... నామపత్రాలు సమర్పించారు. రాప్తాడు కూటమి అభ్యర్ధిగా మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ ప్రక్రియ అట్టహాసంగా సాగింది. మూడు పార్టీల కార్యకర్తలు భారీగా తరలివచ్చి... సునీతకు మద్దతు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. కర్నూలు అసెంబ్లీ కూటమి అభ్యర్థి టీజీ భరత్ నామినేషన్ వేశారు. కింగ్ మార్కెట్ నుంచి కొండారెడ్డి బురుజు మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి.... నామపత్రాలు సమర్పించారు...Spot..
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కార్యకర్తలతో కలిసి... భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం కాంగ్రెస్ అభ్యర్థిగా కొండేటి చిట్టిబాబు నామినేషన్ వేశారు. అనకాపల్లి జిల్లా చోడవరం కూటమి అభ్యర్థి K.S.N.S. రాజు, లోక్‌సభ అభ్యర్థి సీఎం రమేష్, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. పార్వతీపురం అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా బోనుల విజయచంద్ర నామినేషన్ వేశారు. NTR విగ్రహానికి పూలమాలలు వేసి.... భారీ ర్యాలీగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు. శ్రీకాకుళం కూటమి అభ్యర్థి గోండు శంకర్... ఎంపీ రామ్మోహన్ నాయుడితో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 29 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశముంది..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com