చంద్రబాబుపై రాళ్ల దాడి... సీరియస్ గా తీసుకున్న NSG

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై వైసీపీ రాళ్ల దాడి ఘటనను NSG హెడ్‌క్వార్టర్స్ సీరియస్‌గా తీసుకుంది. రాళ్ల దాడిపై NSG హెడ్ క్వార్టర్స్‌కు ఇక్కడి అధికారులు సమాచారం ఇచ్చారు. NSG కమాండెంట్‌కు రాళ్ల దాడిలో గాయాలు కావడంపై హెడ్ క్వార్టర్స్ ఆరా తీసింది. తలపై గాయం కావడంతో కమాండెంట్‌ను అధికారులు స్కానింగ్‌కు పంపించారు. యర్రగొండపాలెం పోలీసులకు ఘటనపై ఫిర్యాదు చేయాలని ఆదేశించింది. గతంలో నందిగామ, ఇప్పుడు యర్రగొండపాలెం దాడి ఘటనలపై NSG బృందం నివేదిక ఇచ్చింది. దీనిపై నేడో, రేపో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చంద్రబాబు దగ్గర వరకు ఆందోళనలను రానివ్వడంపై NSG బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది.
యర్రగొండ పాలెంలో దాడి ఘటనపై ముఖ్యనేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈమెయిల్ ద్వారా ఘటన వివరాలను టీడీపీ నేతలు పంపారు. అలాగే వైసీపీ దాడిపై కేంద్రానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో టీడీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. పక్కా స్కెచ్‌తోనే చంద్రబాబు రాళ్ల దాడి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com