మెల్‌బోర్న్‌లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

ఆస్ట్రేలియాలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మెల్‌బోర్న్‌లో జరిగిన వేడుకకు నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, కుమార్తె తేజస్విని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు.. పెద్ద ఎత్తున హాజరయ్యారు. వసుంధర జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందర్ని ఆకట్టుకున్నాయి.
ఎన్టీఆర్‌తో తమకున్న అనుబంధాన్ని అతిథులు గుర్తు చేసుకున్నారు . పిల్లలను ఎన్టీఆర్ ఎంతో క్రమశిక్షణతో పెంచారని అన్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయారని వసుంధర అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తామని చెప్పారు. భవిష్యత్ తరాలకు ఎన్టీఆర్ స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు.తెలుగు చలన చిత్ర పరిశ్రమను.. హైదరాబాద్‌కు తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్‌దే అన్నారు తేజస్విని. ఆయన మనవరాలిగా పుట్టడం తనకు దక్కిన అదృష్టమని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com