NTR Trust Bhavan : కోవిడ్ బాధితులకోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ ట్రస్ట్

NTR Trust : కోవిడ్ బాధితులకోసం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ తన సేవలను మళ్లీ ప్రారంభించింది. ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి సూచనల మేరకు కరోనా బాధితులకు సేవలను ప్రారంభించారు. కరోనా బాధితులకు టెలిమెడిషన్ కోసం ప్రత్యేకంగా వైద్యబృందాన్ని ఏర్పాటుచేశారు.
ఆన్‌లైన్ ద్వానా నేరుగా వైద్యులతో మాట్లాడే ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకోసం ఎన్నారై వైద్యుడు డాక్టర్ లోకేశ్వరావుతోపాటు రాష్ట్రంలోని నిపుణులతో వైద్యబృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 7గంటలకు జూమ్‌ద్వారా కోవిడ్ రోగులకు వైద్యసూచనలు ఇవ్వనున్నారు.
రోగులకు అవసరం అయిన మందులు, మెడికల్ కిట్లను అందుబాటులోకి తెచ్చినట్లు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వర్గాలు తెలిపాయి. గత ఏడాది కరోనా బాధితులకు కోటి 75లక్షలతో సేవలను అందించినట్లు పేర్కొన్నారు. మూడు చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు.
కుప్పం, శ్రీకాకుళం జిల్లా టెక్కలి, మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఆక్సిజన్ ప్లాంట్ ఉన్నాయన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com