NTR Trust : ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే NTR ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం : భువనేశ్వరి

NTR Trust : ఊహించని వరదల కారణంగా తిరుపతి ప్రజలు పడిన కష్టాల గురించి చెప్పడానికి మాటలు రావడం లేదన్నారు నారా భువనేశ్వరి. వర్షాలు, వరదల కారణంగా ఎన్నో కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకోవడానికి NTR ట్రస్ట్ తరపున తమవంతుగా సాయం చేస్తున్నామని తెలిపారు. నవంబర్ నెలలో వచ్చిన వరదల్లో ఆత్మీయుల్ని కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున మేనేజింగ్ ట్రస్టీగా నారా భువనేశ్వరి ఆర్థిక సహాయం అందించారు. ఆప్తులను కోల్పోయిన ఒక్కో బాధిత కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున చెక్కులు అందచేశారు. నాడు వరదల సమయంలోనూ బాధితులకు అండగా నిలిచింది ఎన్టీఆర్ ట్రస్ట్. బాధితులకు ఆహారం, మంచినీరు అందించింది. ఇక ఇప్పుడు కుటుంబాల్లో ఆత్మీయుల్ని కోల్పోయిన వారికి అండగా నిలిస్తూ ఆర్థికసాయం చేశారు. ప్రజలకు సేవ చేయాలనే తపన తన తండ్రి NTRలో ఎప్పుడూ ఉండేదని, అదే స్ఫూర్తితో ఇప్పుడు తాము పనిచేస్తున్నామని భువనేశ్వరి అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com