Kakinada: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పులి సంచారం.. కొనసాగుతున్న అధికారుల టైగర్ హంట్..

Kakinada: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పులి సంచారం.. కొనసాగుతున్న అధికారుల టైగర్ హంట్..
Kakinada: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పులి వేట కొనసాగుతోంది. పులిని బంధించేందుకు అటవీశాఖ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

Kakinada: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పులి వేట కొనసాగుతోంది. పులిని బంధించేందుకు అటవీశాఖ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. శరభవరం వద్ద పంటపొలాల్లో పులిని పట్టుకునేందుకు ఎరగా బోనులో ఆవు మాంసం ఉంచడంతో పాటు కొద్దిదూరంలో ఓ చెట్టుకు లేగ దూడను కట్టివేశారు. అలాగే ఆ ప్రాంతాన్ని టైగర్‌ జోన్‌గా ప్రకటించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా సిబ్బందిని కాపలాగా ఉంచారు.

కాగా శరభవరం, పాండవులపాలెం, బవురువాక, ఓమ్మంగి, పొదురుపాక ప్రాంతాల్లో పులి సంచారంతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. గత 12 రోజులుగా పెద్ద పులి.. పంట పొలాల్లోని పశువులపై దాడి చేస్తోంది. దీంతో అక్కడివారంతా పొలాల్లోకి వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. పొదురుపాక, ఒమ్మంగి, శరభవరం పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. దాని పాదముద్రలను కనుగొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story