MANCH: మంచు కుటుంబంలో మళ్లీ యుద్ధం

ప్రముఖ టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబుు కుటుంబ వివాదం.. మరోసారి రచ్చకెక్కింది. తన కారు పోయిందని పేర్కొంటూ మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సోదరుడు విష్ణు చేయిస్తున్నారని ఆరోపించారు. జల్‌పల్లి నివాసం వద్దకు చేరుకున్న మనోజ్.. గేటు బయట భైఠాయించి నిరసన తెలిపారు. తనది ఆస్తి గొడవ కాదని... తన జుట్టు విష్ణు చేతుల్లోకి ఇచ్చేందుకు ఇలా చేస్తున్నారని మనోజ్ సంచలన ఆరోపణలు చేశారు.
తల్లి మీద ఒట్టు
తాను ఏ రోజూ ఆస్తి కోసం కొట్లాడలేదని తన తల్లి మీద ప్రమాణం చేస్తున్నానని మనోజ్ అన్నాడు. విష్ణుకి తానంటే కుల్లు అని, కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికి తనను ఇంటి లోపలికి వెళ్లనివ్వడం లేదని మనోజ్ ఆరోపించాడు. జల్ పల్లీ నివాసంలో తనవి 3 పెంపుడు జంతువులు ఉన్నాయని, వాటిని తనకు ఇవ్వమని అడుగుతున్నానని మనోజ్ తెలిపారు. తప్పుడు సంతకాలతో కోర్టులను పక్కదారి పట్టిస్తున్నారని మనోజ్ మండిపడ్డారు. నా కూతురు బర్త్ డే చేసుకోవడానికి ఏప్రిల్ 2న ఇక్కడకు వచ్చానని, ఇక్కడ పరిస్థితులు బాగోలేక పోవడంతో జైపూర్ వెళ్లామని అన్నారు. తాను విష్ణు భవిష్యత్ కోసం ఆడవేషం కూడా వేశానని మనోజ్ గుర్తు చేశారు. అలాగే తాజా పరిస్థితులపై తాను ఫిర్యాదు చేసినప్పటికి పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు చార్జిషీట్ దాఖలు చేయట్లేదని మంచు మనోజ్ ప్రశ్నించారు.
ఇంటిపై దాడి చేశారు
తన కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా జైపూర్ వెళ్లగా సోదరుడు విష్ణు 150 మందిలో జల్‌పల్లిలోని ఇంట్లోకి ప్రవేశించి వస్తువులు, సామగ్రిని ధ్వంసం చేశారని మనోజ్ ఆరోపించారు. మా కార్లను టోయింగ్ వాహనంతో ఎత్తుకెళ్లి రోడ్డు మీద వదిలేశారన్నారు. తన కారును దొంగలించి విష్ణు ఇంట్లో పార్క్ చేశారని మనోజ్ ఆరోపించారు. జల్‌పల్లిలో తన భద్రత సిబ్బందిపై దాడి చేశారని..కమిషనర్ ఇచ్చిన బైండోవర్‌ను వాళ్లు ఎన్నో సార్లు దాటారని తెలిపారు. తాను తప్పు చేశానని, ఆస్తి ఆడిగానని ఒక్క సాక్ష్యం బయటపెట్టినా వాళ్లందరి కాళ్లపై పడి క్షమాపణ కోరతా." అని మంచు మనోజ్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com