TTD : మొదలైన ఏకసభ్య కమిషన్ విచారణ.. వైసీపీలో టెన్షన్..

TTD : మొదలైన ఏకసభ్య కమిషన్ విచారణ.. వైసీపీలో టెన్షన్..
X

తిరుమల్ లడ్డూ నెయ్యి కల్తీ కుంభకోణంలో అసలు దోషులను బయటపెట్టే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఏకసభ్య విచారణ కమిషన్ వేసిన సంగతి తెలిసిందే. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఈ కమిటీ వేశారు. ఈ కమిషన్ వేసినప్పటి నుంచి వైసీపీ ఎంత గగ్గోలు పెడుతుందో చూస్తూనే ఉన్నాం. సీబీఐ నియమించిన సిట్ నివేదికలో నిందితుల పేర్లను యాడ్ చేయలేదు కాబట్టి తప్పించుకున్నాం అని మురిసిపోయిన వైసీపీ నాయకులు.. ఇప్పుడు ఏకసభ్య విచారణ కమిషన్ ఎక్కడ తమ బాగోతం బయటపెడుతుందో అని వణికిపోతున్నారు. ఇక తాజాగా దినేష్ కుమార్ తన విచారణ మొదలు పెట్టారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత విచారణ స్టార్ట్ చేశారు. టీటీడీలోని పలు విభాగాలను ఆయన పరిశీలించారు. అలాగే వైసీపీ హయాంలో జరిగిన కల్తీ నెయ్యికి సంబంధించిన పలు సాక్ష్యాలను, వాటితో పాటు ఇతర డిపార్టుమెంట్ల రిజిస్టర్లను కూడా చెక్ చేశారు.

దీంతో వైసీపీలో గందరగోళం మొదలైంది. ఎక్కడ తమ పేర్లు బయటకు వస్తాయో అని వారంతా ఆందోళన చెందుతున్నారు. అందులో భాగంగానే లేనిపోని ఆరోపణలకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారి మీద ఎలాంటి తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. పనికి రాని.. పనికి మాలిన ఏఐ, ఎడిటెడ్ ఫొటోలు, వీడియోలతో వైసీపీ చేస్తున్న యాగి అంతా ఇంతా కాదు. కానీ వారు ఎన్ని కుట్రలు చేసినా సరే ఏకసభ్య కమిషన్ విచారణ మాత్రం ఆగదు.

అసలు దోషులను ప్రజల ముందు నిలబెట్టడం ఖాయం అని ఇప్పటికే కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇందులో భాగంగానే ఏకసభ్య విచారణ కమిషన్ స్పీడ్ గా విచారణ మొదలు పెట్టింది. 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఆ మేరకు దినేష్ కుమార్ తన విచారణను స్పీడప్ చేశారు. త్వరలోనే కీలక నిందితుల వివరాలను సేకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కల్తీ నెయ్యి కేసులో డైరెక్ట్ గా ఇన్ డైరెక్టుగా ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరినీ నిందితులుగానే పరిగణించబోతున్నారు.

Tags

Next Story