Jangareddigudem: కల్తీ సారా వల్ల మరొకరు మృతి.. సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం..!

Jangareddigudem: కల్తీ సారా వల్ల మరొకరు మృతి.. సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం..!
Jangareddigudem: కల్తీ నాటు సారా మరణాలను కావాలనే సహజ మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందా?

Jangareddigudem: కల్తీ నాటు సారా మరణాలను కావాలనే సహజ మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందా? పశ్చిమ గోదావరి జిల్లాలో తాజాగా మరొకరు మరణించిన తీరు, పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తుంటే.. అవన్నీ సాధారణ మరణాలుగా మార్చే కుట్ర జరుగుతోందన్న అనుమానాలొస్తున్నాయి. జంగారెడ్డిగూడెం 16వ వార్డులో నివాసం ఉంటున్న వరదరాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

వరదరాజుకు నాటు సారా తాగే అలవాటు ఉంది. రెండు రోజుల క్రితం కూడా సాగా తాగాడు. ఉన్నట్టుండి వాంతులు, విరేచనాలు, ఒళ్లొంతా చెమటలు పట్టే సరికి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో గుంటూరు తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్‌మెంట్‌ జరుగుతుండగానే వరదరాజు కన్నుమూశాడు. వరదరాజు కల్తీ సారా తాగడం వల్లే చనిపోయాడంటూ భార్య కంప్లైంట్ చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది.

కాని, ఎస్సై మాత్రం వరదరాజు చెట్టు నుంచి కింద పడిపోవడం వల్లే చనిపోయాడని కేసు రాసుకుంటామంటూ చెబుతున్నారని మృతుడి భార్య రోధిస్తోంది. వరదరాజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడనేది పేషెంట్‌ కేస్‌ షీట్‌లో చాలా క్లియర్‌గా రాశారు. వాంతులు, కడుపు నొప్పి, ఒళ్లంతా చెమటలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడని, తాగి ఉన్నాడని అందులో డాక్టర్లు చాలా క్లియర్‌గా రాశారు.

మెడికల్‌ ఎవిడెన్స్‌ చాలా క్లియర్‌గా కనిపిస్తున్నా సరే.. వరదరాజు మాత్రం చెట్టు నుంచి పడి చనిపోయాడనే కేసు రాసుకుంటామంటూ చెబుతున్నారని భార్య ఆవేదనతో చెబుతోంది. సారా తాగిన తరువాతే ఏదో అయిపోతుందంటూ చనిపోకముందు స్వయంగా వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. వరుసగా వాంతులు, విరోచనాలు, తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుంటే.. చూసి తట్టుకోలేక ఆస్పత్రులకు తీసుకెళ్లారు.

చికిత్స పొందుతుండగా కొందరు, ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఇంట్లో మరికొందరు చనిపోయారు. ఈ విషయాన్ని బాధిత కుటుంబ సభ్యులే చెబుతున్నారు. కాని, ప్రభుత్వం మాత్రం సహజ మరణాలు అంటూ పచ్చి అబద్దాలు చెబుతోందంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఆస్పత్రిలో మరణించాడంటే అది సహజ మరణం ఎలా అవుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వేల మంది జనాభా ఉన్న పట్టణంలో ఆ మాత్రం చనిపోరా అని సాక్షాత్తు ముఖ్యమంత్రే అన్న తరువాత.. పోలీసులు ధైర్యంగా కేసు నమోదు చేయగలరా అని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు.

Tags

Read MoreRead Less
Next Story