AP Floods: ఆ రెండు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. భారీ వర్షాలు..

AP Floods (tv5news.in)
X

AP Floods (tv5news.in)

AP Floods: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వచ్చిన వరదలు.. ప్రజల మనసుల్లో ఒక పీడకలగా మిగిలిపోయాయి.

AP Floods: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వచ్చిన వరదలు.. ప్రజల మనసుల్లో ఒక పీడకలగా మిగిలిపోయాయి. అంతే కాక వర్షాలు తగ్గిపోయినా.. ఇంకా కొందరు ప్రజలు నీళ్లలోనే బతుకుతున్నారు. కానీ వర్షాలు పూర్తిగా తగ్గలేదని.. ముందు ముందు ఇంకా ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని రెండు జిల్లాలకు ఇంకా ప్రమాదం పూర్తిగా తగ్గిపోలేదని అంటోంది.

ఆంధ్రప్రదేశ్‌ను ముంచెత్తిన వరదల్లో ఎక్కువగా నష్టపోయింది చిత్తూరు, నెల్లూరు జిల్లాల వాసులే. అయితే ఇప్పటికీ కూడా వారు సేఫ్ కాదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈనెల 28, 29 తేదీల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ అధికారులు అంటున్నారు. ఇక్కడ 13 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయట.

ఈనెల 29న అండమాన్‌ తీరంలో ఏర్పడే అల్పపీడనం వల్లే ఈ భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయట. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఇప్పటికే పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇళ్లు నేలమట్టం అయిపోయాయి. ప్రజల జీవితాలు నీటిలో మునిగిపోయాయి. అందుకే 29 కంటే ముందే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలన్న ఆలోచనతో వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

Tags

Next Story