TTD బోర్డు మెంబర్‌గా లిక్కర్‌ కేసు నిందితుడు

TTD బోర్డు మెంబర్‌గా లిక్కర్‌ కేసు నిందితుడు
టీటీడీ అంటే పవిత్రతకు మారుపేరు వెంకన్న సేవను రాజకీయ ఆశ్రమంగా మార్చేశారు


టీటీడీ అంటే పవిత్రతకు మారుపేరు. అలాంటి పవిత్ర సంస్థ పాలకమండలిలో లిక్కర్‌ కేసులో నిందితుడికి చోటు కల్పించారని విమర్శలు వస్తున్నాయి.లిక్కర్‌ కేసులో అరెస్టై, అప్రూవర్‌గా మారిన శరత్‌ చంద్రారెడ్డికి చోటు కల్పించింది వైసీపీ సర్కార్‌. వైసీపీలో నంబర్‌గా 2 చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డి అల్లుడు కావడమేనంటున్నాయి విపక్షాలు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ పూర్తిగా శరత్‌చంద్రారెడ్డి చేతుల్లోకి వచ్చిందంటే అది సాయిరెడ్డి ప్రభావమేనంటున్నాయి విపక్షాలు. ఇక ఆయన వ్యాపార సంస్థలకు ఏపీలో పలు ప్రాజెక్టులు కూడా దక్కాయి. లిక్కర్‌ కేసులో అప్రూవర్‌గా మారడం అంటే తప్పును ఒప్పుకున్నట్లేనని అలాంటి వ్యక్తికి పదవి ఎలా కట్టబెడతారని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు.


మరోవైపు సీఎం సామాజికవర్గానికే ఈసారి బోర్డులో అయిదో వంతు పదవులు దక్కాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇక రాజకీయ పునరావాసంలో భాగంగా మరికొందరికి కట్టబెట్టారని,మంత్రిమండలిలోకి తీసుకోలేకపోయిన ఎమ్మెల్యేలు పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌, సామినేని ఉదయభాను, ఎం.తిప్పేస్వామి లకు టీటీడీ బోర్డు మెంబర్‌ పదవులను కట్టబెట్టారు. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఆశిస్తున్నవారిలో మేకా శేషుబాబు, గాదిరాజు వెంకట సుబ్బరాజు, శిద్ధా వీర వెంకట సుధీర్‌కుమార్‌ లకు టీటీడీ బోర్డు సభ్యుల పదవులు దక్కాయి. ఛైర్మన్‌ పదవి కోసం శిద్ధా రాఘవరావు ప్రయత్నించారు. అది ఇవ్వలేకపోతే తన కుమారుడికి వచ్చే ఎన్నికల్లో టికెటివ్వాలని సీఎంని కోరారు. ఈ నేపథ్యంలో సుధీర్‌కు బోర్డు సభ్యత్వం ఇచ్చారు.

ఇక కడప ఎంపీ అవినాష్‌రెడ్డి అనుచరుడైన వెంకట సుబ్బారెడ్డికు, వైఎస్‌ కుటుంబానికి విధేయుడు, కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేష్‌, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ముఖ్య అనుచరుడు నాయీబ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సిద్ధవటం యానాదయ్యకూ బోర్డులో అవకాశం కల్పించారు. ఇక... డాక్టర్‌ కేతన్‌ దేశాయ్‌ను ఈసారి కూడా కొనసాగించారు. ఇక.. తెలంగాణనుంచి కూడా సభ్యులగా అవకాశం ఇచ్చారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి భార్య గడ్డం సీతారెడ్డికి, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సాముల రాంరెడ్డికి అవకాశమిచ్చారు.

అటు తమిళనాడు నుంచి.. బాలసుబ్రమణియన్‌ పళనిస్వామి, కృష్ణమూర్తి వైద్యనాథన్‌, డాక్టర్‌ ఎస్‌.శంకర్‌ అవకాశం ఇచ్చారు. ఇక.. కర్ణాటక నుంచి ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌రెడ్డి, రఘునాథ్‌ విశ్వనాథ్‌ దేశ్‌పాండే ని సభ్యత్వం ఇచ్చారు. మహారాష్ట్ర నుంచి అమోల్‌ కాలే, మిలింద్‌ కేశవ్‌ నర్వేకర్‌, డాక్టర్‌ కేతన్‌ దేశాయ్‌, బొరా సౌరభ్‌ టీటీడీ సభ్యులయ్యారు. TTD బోర్డు మెంబర్‌ పదవి లిక్కర్‌ కేసు నిందితుడికి ఇవ్వడంపై మండిపడ్డారు బీజేపీ ఏపీ చీఫ్‌ పురంధేశ్వరి. మరోసారి ఏపీ సీఎం జగన్‌ తిరుమల పవిత్రతను దెబ్బతిశారని అన్నారు. వివిధ కేసుల్లో నిందితులగా ఉన్న వారిని పవిత్ర దేవాలయ బోర్డులో పదవుల కట్టబెట్టారని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story