Srisailam : శ్రీశైలంలో అన్యమత ప్రచారం.. సెక్యూరిటీ అధికారిపై వేటు

X
By - Manikanta |20 May 2025 11:45 AM IST
శ్రీశైలం దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్న పై వేటు పడింది. ఆయన్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఈఓ ఉత్తర్వులు జారి చేశారు. శ్రీశైలం దేవస్థానం క్షేత్ర పరిధిలో అన్యమత ప్రచారం జరుగుతోందన్న విజువల్స్ వైరల్ అయ్యాయి. ఈ విజువల్స్ లో వారు శ్రీశైలం టోల్ గేట్ దాటి ప్రచారం చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో దేవస్థానం సెక్యూరిటీ సిబ్బందిపై చర్యలు తీసుకుంది.
వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా అన్యమతస్తులు శ్రీశైలంలోకి ఎలా వచ్చారు ? టోల్ గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బందిని ఎలా దాటుకుని క్షేత్రం పరిధిలోకి ఎలా వచ్చారు.? వారికి ఎవరు సహకరించారు? అనే కోణంలో విచారణ చేపట్టారు. అయితే అన్యమతస్తులు గత వారం రోజులు కిందట శ్రీశైలంలో సంచరించారని తెలుస్తోంది.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com