PAK: మళ్లీ పాకిస్థాన్ డ్రోన్ దాడులు

పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది.జమ్మూ, సాంబా, పఠాన్‌కోట్‌లతో పాటు అమృత్‌సర్, ఫిరోజ్‌పుర్, హోషియార్‌పుర్, గురుదాస్‌పుర్, తర్న్ తరణ్ లక్ష్యంగా డ్రోన్ దాడులకు తెగబడింది. పాక్ డ్రోన్ దాడుల్ని భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది. జమ్మూ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. తనకూ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. జమ్మూ, పరిసర ప్రాంత ప్రజలు వీధుల్లోకి రావొద్దని, ఇళ్లకే పరిమితం కావాలని ముఖ్యమంత్రి సూచించారు. వదంతులను పట్టించుకోవద్దని, ఆధారాలు లేని, ధ్రువీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని పిలుపునిచ్చారు.**
బ్లాక్‌అవుట్ విధింపు
మరోవైపు, నియంత్రణ రేఖ వెంబడి పాక్ రేంజర్లు భారీగా కాల్పులకు తెగబడ్డారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో బ్లాక్‌అవుట్ విధించారు. జమ్మూ డివిజన్ ఉధంపుర్‌లో పూర్తిగా బ్లాక్ అవుట్ పాటించారు. ఆ ప్రాంతంలో భారీగా సైరన్ శబ్దాలు వినిపిస్తున్నాయి. జమ్మూ, అఖ్నూర్, జైసల్మేర్, హరియాణాలోని అంబాలా, పంచకుల, పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్, మోగా, జలంధర్, ఫజిల్కా ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేశారు.*
అమృత్‌సర్‌లో పేలుళ్లు!
పాక్ రెండో రోజు డ్రోన్లతో భారత్‌పై దాడులు జరుపుతుంది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో భారీ స్థాయిలో పేలుళ్ల శబ్దాలు వినపడ్డాయి. నాలుగు చోట్ల శబ్దాలు వినిపించాయి. ఈ శబ్దాలు దేనికి సంబంధిచినవో క్లారిటీ రాలేదు. పంజాబ్ పూర్తిగా బ్లాక్ అవుట్‌లో ఉండటంతో చీకట్లో పాక్ రెచ్చిపోయింది. ఈ దాడులను భారత్ తిప్పికొడుతున్నట్లు తెలుస్తోంది.
నాలుగు గగనతల వ్యవస్థలపై భారత్ దాడి..
భారత నగరాలు, పౌర సదుపాయాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలకు దిగిందని భారత్ అధికారులు వెల్లడించారు. బఠిండా సైనిక స్థావరం లక్ష్యంగా డ్రోన్‌లు దూసుకొచ్చాయని... భారత సాయుధ బలగాలు వాటిని తిప్పికొట్టాయని తెలిపింది. పాకిస్థాన్‌లోని నాలుగు గగనతల రక్షణ వ్యవస్థలపై దాడులు చేశామని... ఒక ఏడీ రాడార్ వ్యవస్థను భారత డ్రోన్ ధ్వంసం చేసిందని వెల్లడించారు. ఈ దాడులను పాకిస్థాన్ అధికార యంత్రాంగం తిరస్కరించడం.. వారి ద్వంద్వ వైఖరిని తెలియజేస్తుందన్నారు. **పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో కర్తార్ పూర్ కారిడార్‌ను మూసేశామని తెలిపారు. సింధూ నది జలాల ఒప్పందం ప్రస్తుతానికి రద్దు అని మరోసారి క్లారిటీ ఇచ్చారు. టెర్రరిజాన్ని పెంచిపోషిస్తోన్న పాక్‌కు నిధులు ఇవ్వొద్దని ఐఎంఎఫ్ మీటింగ్‌లో డిమాండ్ చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఐఎంఎఫ్‌లోని మిగిలిన సభ్య దేశాలతో చర్చిస్తున్నామని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com