AP : పలాస ఎమ్మెల్యే శిరీష అరుదైన రికార్డు

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో సామాజిక భాద్యతగా 215 కిలోమీటర్ల రహదారి ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్ చేపట్టి ప్రశంసలు అందుకున్నారు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష.. చుట్టూ ఏపుగా పెరిగిన గడ్డి, చెత్త, మొక్కలు తీయడం వల్ల జంగిల్ క్లియరెన్స్ తో నూతన ఒరవడికి నాంది పలికారు... తొలి సారి గెలిచిన ఎమ్మెల్యే అయినప్పటికీ.. ప్రభుత్వానికి ఆర్థిక భారం కాకుండా నేను సైతం అంటూ ముందడుగు వేశారు.. సమాజానికి పిలుపునిచ్చి ప్రజలను భాగస్వామ్యం చేశారు..
పలాస నియోజకవర్గంలోని రోడ్లకి ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్‌కు స్వచ్ఛందంగా రావాలని మన పలాస మన బాధ్యత కార్యక్రమానికి ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.. ఎమ్మెల్యే పిలుపునకు ఉదయం 6 గంటల నుంచి ప్రజల నుంచి భారీగా స్పందన లభించింది. పార్టీలకతీతంగా జంగిల్ క్లియరెన్స్ పనుల్లో ప్రజలు, పార్టీ శ్రేణులు స్వచ్చంధంగా పాల్గొన్నారు..
గత కొన్నేళ్లుగా జంగిల్ క్లియరెన్స్ చేపట్టక పోవడంతో వాహన చోదకులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ, వజ్రపు కొత్తూరు, మందస మండలాల్లో 215 కిలోమీటర్ల రోడ్లకి ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్‌కు శ్రీకారం చుట్టారు.. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని వేచి చూడకుండా, ప్రభుత్వానికి ఆర్థిక భారం పడకుండా సామాజిక భాధ్యతగా యుద్ధ ప్రాతిపదికన నియోజకవర్గం మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేపట్టిన ఎమ్మెల్యే గౌతు శిరీష పనితీరు పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు...
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com