Panchakarla ramesh babu : వైసీపీకి ఝలక్ ఇచ్చిన పంచకర్ల రమేష్ బాబు

విశాఖలో వైసీపీకి వైసీపీ YCP అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు ( Panchakarla ramesh babu )ఝలక్ ఇచ్చారు రమేష్ బాబు మాట్లాడుతూ నా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో దురుద్దేశంతో నేనెప్పుడూ పార్టీలు మారలేదు, నా ఇష్టానుసారంగానే టీడీపీ నుంచి వైసీపీలో చేరాను , విజయసాయిరెడ్డి పిలుపుతో వైసీపీలో చేరిన నేను ఏడాది క్రితం వైసీపీ విశాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాను కొంతమంది కార్యకర్తలు, ద్వితీయ స్థాయి నేతలకు న్యాయం చేయలేకపోయాను
ఈ విషయం వైసీపీ పెద్దలకు చెప్పినా సఫలీకృతున్ని కాలేకపోయాను నేను ఫెయిల్యూర్ అధ్యక్షుడిని అని చెప్పుకొచ్చిన అయన తనను అవిషయంలో క్షమించగలరు అన్నారు కొన్ని విషయాలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్దామని ప్రయత్నించాను, కానీ అవ్వలేదు వైసీపీ పార్టీకి, వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను అంటూ వెల్లడించారు.
ఇక పార్టీ మారె ఆలోచన పై ఇలా స్పందించారు వేరే పార్టీలో చేరే అంశం ఇంకా ఆలోచన చేయలేదు నా అభిమానుల ఆకాంక్ష మేరకు నిర్ణయం తీసుకుంటాను,నేను వ్యక్తిగతంగా కొందరిని టార్గెట్ చేయకపోవడం కూడా వైసీపీ ని వీడడానికి కారణం అంటూ వైసీపీ పార్టీ పై అలకను వెళ్లబుచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com