Andhra Pradesh: నాలుగు నెలల పసికందు విక్రయం

Andhra Pradesh: నాలుగు నెలల పసికందు విక్రయం
Andhra Pradesh: ఏలూరు జిల్లాలో నాలుగు నెలల పసికందు విక్రయం కలకలం రేపింది. పొత్తిళ్లలో పాలు తాగాల్సిన పసిబిడ్డను అమ్మకానికి పెట్టారు.

Andhra Pradesh: ఏలూరు జిల్లాలో నాలుగు నెలల పసికందు విక్రయం కలకలం రేపింది. పొత్తిళ్లలో పాలు తాగాల్సిన పసిబిడ్డను అమ్మకానికి పెట్టారు. అయితే పసిబిడ్డ విక్రయ ధర విషయంలో విభేదాలు తలెత్తడంతో వ్యవహారం కాస్త బెడిసి కొట్టింది. దీంతో వ్యవహారం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ఈ ఘటన ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శేషాచల కొండపై చోటుచేసుకుంది. రాజమండ్రికి చెందిన రాజు, శాంతిలు భార్యాభర్తలు. వీరిమధ్య తరచూ విభేదాలు తలెత్తటంతో నాలుగు నెలల పసిబిడ్డను అమ్మకానికి పెట్టారు. భీమవరానికి చెందిన పిల్లలు లేని వ్యక్తి బిడ్డను కొనుక్కునేందుకు సిద్ధమయ్యాడు.

వీరంతా శేషాచల కొండపైగల పార్కింగ్‌ వద్ద తండ్రి, తాత మధ్య విభేదాలు తలెత్తాయి. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారందరినీ పీఎస్‌కు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story