PAWAN: జగన్‌ది అసమర్థ ప్రభుత్వం: పవన్

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నది అసమర్థ ప్రభుత్వమని.. కాంట్రాక్టు ఉద్యోగులకే కాదు.. ఐఏఎస్, ఐపీఎస్‌లకూ జీతాలు ఇవ్వలేకపోతున్నారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మండిపడ్డారు. IAS, IPS జీతాలను కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఇవ్వాలని, కేంద్రమే ఈ నిధులు భరిస్తుందని.. ఆ సొమ్మునూ జగన్ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని, ఈ ప్రభుత్వానికి రాజ్యాంగ ఉల్లంఘన అలవాటైందని విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పవన్ విలేకరులతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధిని సుస్థిరం చేసి.. అన్ని రకాలుగా ప్రగతిమార్గంలో నిలపాలన్న దృఢనిశ్చయంతోనే తెలుగుదేశంతో కలిసి అడుగులు వేస్తున్నామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపడం ఖాయమని ఆయన అన్నారు. ప్రజల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్న సీఎం జగన్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఒక రోడ్డు వేయలేని, వంతెన కట్టలేని సీఎం జగన్‌కు ఓటెందుకు వేయాలని పవన్ ప్రశ్నించారు. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేస్తామని పునరుధ్టాటించారు. తాము NDAలో లేమంటూ జగన్ పార్టీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2024లో తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని పవన్ స్పష్టం చేశారు. ఇంటర్ ధ్రువపత్రాలు ఇవ్వలేని వారికి ఓట్లడిగే హక్కు ఎక్కడిదని మండిపడ్డారు. కొల్లేరును వైసీపీ నేతలు కొల్లగొడుతున్నారని పవన్ మండిపడ్డారు. తాను ‘సీఎం కావడం కన్నా ప్రజల శ్రేయస్సే ప్రధానమన్న పవన్ ...సంక్షేమం పేరుతో మభ్యపెడుతున్న జగన్‌కు ప్రజలు బుద్ధి చెబుతారని మండిపడ్డారు. ఆయన నొక్కని బటన్లు కోకొల్లలని విమర్శించారు..
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నామని, ఆ పార్టీతో సమన్వయానికి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షుడిగా కమిటీని ఏర్పాటుచేశామని పవన్ తెలిపారు. జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బి.మహేందర్‌రెడ్డి, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్, కొటికలపూడి గోవిందరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, మత్స్యకార విభాగం నాయకుడు బొమ్మిడి నాయకర్‌లు కమిటీలో ఉంటారని వెల్లడించారు. రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని. భాజపా, జనసేన సమన్వయ కమిటీ ఇప్పటికే ఉందని వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com