BABU ARREST: కక్ష సాధింపే అన్న పవన్‌, బాలయ్య

BABU ARREST: కక్ష సాధింపే అన్న పవన్‌, బాలయ్య
చంద్రబాబుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన పవన్‌... జగన్‌ది రాజకీయ కక్ష సాధింపన్న బాలయ్య

చంద్రబాబు అరెస్టును జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తీవ్రంగా ఖండించారు. ఏ తప్పూ చేయని నాయకులను జైల్లో పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పట్ల పోలీసుల తీరు దారుణమని జనసేనాని విమర్శించారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టును ఖండించడంతోపాటు.. ఆయనకు మద్దతు తెలిపారు. అక్రమాలు చేసిన జగన్ మాత్రం విమానాల్లో విదేశాలకు వెళ్లారని గుర్తు చేశారు. ఇలాంటి చర్యలను వైకాపా ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందన్న పవన్‌కల్యాణ్‌.. ప్రాథమిక ఆధారాలు చూపకుండా అర్ధరాత్రి అరెస్టు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు అరెస్టును రాజకీయ కక్షసాధింపుగానే భావిస్తున్నామని, చంద్రబాబుకు తన సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాని అన్నారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యేనంటూ మండిపడ్డారు. దోపిడీలు చేసి జైళ్లకు వెళ్లిన నాయకులు విదేశాల్లో తిరుగుతుంటే చంద్రబాబు లాంటివారిని అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.


ప్రతిపక్షనేతలపై కక్ష్యసాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల దౌర్భాగ్యమని నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. జగన్ పదహారు నెలలు జైల్లో ఉన్నాడని కనీసం చంద్రబాబు నాయుడుని పదహారు నిమిషాలైన జైల్లో పెట్టాలన్నదే తన లక్ష్యంగా జగన్ కక్షసాధిస్తున్నారని అరోపించారు. స్కీల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి అధారాలు లేకుండా, ఏ చట్టం ప్రకారం చంద్రబాబును అరెస్టు చేశారని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కీల్ డెవలప్ మెంట్ పెద్ద కుంభకోణమని ప్రచారం తప్ప అందులో ఎలాంటి వాస్తవం లేదని ఆయన తెలిపారు.

నిజంగా అవినీతి జరిగి ఉంటే ఇంతవరకు ఎందుకు ఛార్జ్ షీట్ చేయలేదని ప్రశ్నించారు. డిజైన్ టెక్ సంస్థ అకౌంట్ ప్రీజ్ చేసి నిధులు స్తంభింబచేసినప్పుడు కోర్టు మీకు చివాట్లు పెట్టి ఆ నేరానికి సంబంధించింది కాదని ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని గుర్తుచేశారు. స్కీల్ డెవలప్ మెంట్ లో లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారని దానిని కుంభకోణమని ఏ విధంగా అంటారని స్వయంగా హైకోర్టు చెప్పంది మర్చిపోయారా అని ప్రశ్నించారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి తప్పు మీద తప్పు చేస్తూ కోర్టుల చేత చివాట్లు తింటున్నారని ఇది కావాలని రాజకీయ కక్ష్యతో చేస్తున్న కుట్రేనని దువ్వబట్టారు. ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదని.... దీనిపై న్యాయపోరాటం చేస్తామని ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని బాలకృష్ణ అన్నారు.

Tags

Next Story