Jani Master : జానీ మాస్టర్‌పై వేటు వేసిన పవన్ కళ్యాణ్

X
By - Manikanta |17 Sept 2024 1:19 PM IST
ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసిన యువతి నుంచి పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. బాధితురాలి ఇంట్లోనే 3 గంటల పాటు విచారించారు. అలాగే ఆమెకు వైద్య పరీక్షలు చేయించామని, ప్రస్తుతం బాధితురాలిని పోలీసులు భరోసా కేంద్రానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
జానీ మాస్టర్ పవన్ కల్యాణ్ కు వీరాభి మాని, ఏపీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున పలు చోట్ల జానీ మాస్టర్ ప్రచారం కూడా చేశాడు. ఐతే.. జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో చిక్కుకోవడంతో జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆపార్టీ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందంటూ జనసేన ప్రకటన విడుదల చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com