Pawan Kalyan : జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు పెట్టాలి.. పవన్ డిమాండ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 'ఎక్స్'లో ఓ సంస్థ ఫిర్యాదు చేస్తూ పెట్టిన పోస్టుకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ అంశంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు. వైసీపీహయాంలో ఉన్నటీటీడీ బోర్డే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించడం అందరి మనోభావాలనూ దెబ్బతీసిందని చెప్పారు.
ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయ స్థాయిలో 'సనాతన ధర్మరక్షణ బోర్డు' ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ అభిప్రాయపడ్డారు. దీనిపై అన్ని వర్గాల వారితో జాతీయస్థాయిలో చర్చ జరగాలన్నారు. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా కలిసికట్టుగా నిర్మూలించాలని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com