pawan kalyan Deeksha : విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు జనసేనాని మద్దతు.. రేపు పవన్ దీక్ష

pawan kalyan Deeksha : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా ముందుకొస్తున్నారు.వారికి మద్దతుగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో రేపు(ఆదివారం) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పవన్ కళ్యాణ్ దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు.
పవన్‌తో పాటుగా నాదెండ్ల మనోహర్.. పీఏసీ సభ్యులు.. పార్టీ జిల్లాల నేతలు సైతం దీక్షలో పాల్గొంటారు. కొంత కాలంగా ఏపీలో బీజేపీ - జనసేన మైత్రి ఉన్నా..అది నామ్ కే వాస్తే అన్నట్లుగా మారిపోయింది. దీంతో..ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ మిత్రపక్షంగా ఉంటూనే దీక్ష చేయటం ద్వారా ఆయన పరోక్షంగా బీజేపీకి దూరమవుతున్నారనే సంకేతాలు ఇస్తున్నారనే చర్చ మొదలైంది.
గాజువాక జంక్షన్‌లో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మహాధర్నా కొనసాగుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలను, ఆస్తులను అమ్మే నైతిక హక్కు ప్రభుత్వాలకు లేదంటూ నినాదాలు చేశారు. కారుచౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం ఎవరి ప్రయోజనం కోసం అంటూ నిలదీశారు. పార్లమెంట్ సమావేశాల్లో విశాఖ ఉక్కు కోసం ఎంపీలు గళం వినిపించాలని కోరారు.
విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘీభావ దీక్ష
— JanaSena Party (@JanaSenaParty) December 10, 2021
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు
జై జనసేన
జై ఆంధ్ర... జైజై ఆంధ్ర#JSPWithVizagSteelPlant pic.twitter.com/ClO9AQzDwd
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com