Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కు తప్పిన ప్రమాదం ..!

Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కు తప్పిన ప్రమాదం ..!
Pawan Kalyan : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో తలపెట్టిన జనసేన సభకు బయల్దేరి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రమాదం తప్పింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో తలపెట్టిన జనసేన సభకు బయల్దేరి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సిద్ధాంతం గ్రామం వద్ద వాహనంపై నిలబడి పవన్ ప్రజలకు అభివాదం చేస్తున్నారు. ఇంతలో ఓ అభిమాని.. పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు ప్రయత్నించాడు. వాహనంపై పవన్ ఉండగా.. వెనుక నుంచి వచ్చిన ఆ అభిమాని జనసేనాని చేతులు పట్టుకున్నారు. అయితే బ్యాలెన్స్ తప్పడంతో అభిమానితో పాటు పవన్ కళ్యాణ్ వాహనంపైనే కిందకు పడ్డారు. ఎవరికీ ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Tags

Read MoreRead Less
Next Story