AP Deputy CM : ఢిల్లీకి పవన్.. అమిత్ షాతో భేటీపై ఉత్కంఠ

AP Deputy CM : ఢిల్లీకి పవన్.. అమిత్ షాతో భేటీపై ఉత్కంఠ
X

AP డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నట్లు తెలుస్తోంది. వెలగపూడిలో మంత్రి వర్గ సమావేశం అనంతరం పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ బయల్దేరుతారు. ఇటీవల పవన్​ పోలీసుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేయడం, అదేసమయంలో ఢిల్లీకి వెళ్లడం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మాజీ సీఎం జగన్​ మోహన్‌ రెడ్డికి చెందిన సరస్వతి పవర్​ ప్రాజెక్ట్​ భూములను నిన్న పవన్​ కల్యాణ్​ పరిశీలించారు. ఈ నేపథ్యంలో పవన్‌ ఢిల్లీ కి వెళ్ళడం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ కావడం ఆసక్తి రేపుతోంది.

Tags

Next Story