PAWAN: పవన్‌ను గెలిపిస్తామని నాయకుల సంకల్పం

PAWAN: పవన్‌ను గెలిపిస్తామని నాయకుల సంకల్పం
గెలిచి వర్మ రుణం తీర్చుకుంటానన్న పవన్‌... అభిమానులను కంట్రోల్‌ చేయలేకపోయిన పోలీసులు

పిఠాపురం తెలుగుదేశం ఇన్ ఛార్జ్ వర్మ... త్యాగం చేసి తనకు సీటు కేటాయించారని.. గెలిచి ఆయన రుణం తీర్చుకుంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా కొత్తపల్లిలోవర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. నియోజవర్గ ముఖ్యనాయకులు, కార్యకర్తలను పవన్ కువర్మ పరిచయం చేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి పవన్ కల్యాణ్ ను రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని శ్రేణులకు సూచించారు. వివిధ సమస్యలు పరిష్కరించాలని పవన్ కు వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం... సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబుకు... మనస్ఫూర్తిగా మద్దతు తెలిపానని పవన్ పునరుద్ఘాటించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో స్టేజీ పైకి ఒక్కసారిగా జనసైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు దూసుకొచ్చి పవన్ తో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. అభిమానుల్ని పోలీసులు అదుపు చేయకపోవడంతో మాటిమాటికీ పవన్ ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. అభిమానులు, టీడీపీ శ్రేణులను అదుపు చేయడంలో విఫలమైన పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. ఎంతకీ అభిమానులు వేదిక దిగకపోవడంతో సమావేశం ముగించుకుని పవన్ చేబ్రోలులోని నివాసానికి వెళ్లిపోయారు.

అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కలిసి పనిచేయాలని నాయకులు సంకల్పం చేశారు. ‘‘పిఠాపురంలో వర్మతో కలిసి పనిచేస్తున్నా. నన్ను చాలా గౌరవిస్తున్నారు.. ఆయన రుణం తీర్చుకుంటా. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమనే ఆయనకు మద్దతిచ్చా’’ అని పవన్‌ తెలిపారు.

అభిమానులు జాగ్రత్త

పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై జనసేన పార్టీ నేడు కీలక ప్రకటన చేసింది. రికరెంట్ ఇన్ ఫ్లుయెంజా కారణంగా పవన్ కల్యాణ్ ఊపిరితిత్తుల్లో నెమ్ముతో బాధపడుతున్నారని, ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో ఆయనకు జ్వరం వస్తోందని వెల్లడించింది. ఈ సందర్భంగా పవన్ పర్యటనల సందర్భంగా అభిమానులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో జనసేన పార్టీ తన ప్రకటనలో స్పష్టం చేసింది.

"పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితి కారణంగా క్రేన్ గజమాలలు వేయవద్దు. అదే విధంగా కరచాలనాలు, ఫొటోల కోసం ఒత్తిడి చేయవద్దు. పూలు చల్లినప్పుడు నేరుగా ఆయన ముఖం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మేరకు జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, అభిమానులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాము" అని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story