AP : పవన్‌తో బాలినేని భేటీ.. ఏపీలో హాట్ టాపిక్

AP : పవన్‌తో బాలినేని భేటీ.. ఏపీలో హాట్ టాపిక్
X

జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను బాలినేని కలవనున్నారు. పవన్ ను కలిసిన తర్వాత జనసేనలో చేరే తేదీపై ఆయన నిర్ణయం తీసుకోనున్నారు. జగన్ కు బంధువైన బాలినేని వైసీపీకి రాజీనామా చేయడంతో వైసీపీ శ్రేణులు షాక్ కు గురయ్యారు. రాజకీయాలు వేరు... బంధుత్వం వేరు అని బాలినేని అన్నారు. జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు తాను వ్యతిరేకించానని చెప్పారు. విలువలను నమ్ముకుని తాను ఐదుసార్లు ఎమ్మెల్యేగా.. రెండుసార్లు మంత్రిగా పని చేశానన్నారు.

రాజకీయాల్లో ప్రజాప్రతినిధులు మాట్లాడే భాష గౌరవంగా ఉండాలని బాలినేని అన్నారు. కొన్ని కారణాల వల్ల తాను వైసీపీని వీడుతున్నానని చెప్పారు. తన వద్దకు ఎవరు వచ్చినా రాజకీయాలకు అతీతంగా సాయం చేశానని తెలిపారు. ప్రజల తీర్పు తనకు శిరోధార్యమని చెప్పారు బాలినేని.

Tags

Next Story