ఆంధ్రప్రదేశ్

నా ఆరోగ్యం కుదుటపడుతోంది: పవన్ కళ్యాణ్

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 'ప్రస్తుతం నా ఆరోగ్యం కుదుటపడుతోంది. వైద్యుల సూచనలు సలహాలు పాటిస్తున్నాను.

నా ఆరోగ్యం కుదుటపడుతోంది: పవన్ కళ్యాణ్
X

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 'ప్రస్తుతం నా ఆరోగ్యం కుదుటపడుతోంది. వైద్యుల సూచనలు సలహాలు పాటిస్తున్నాను. వీలైనంత త్వరగా కోలుకొని మీ ముందుకు వస్తాను. నేను కరోనా బారినపడ్డాను అని తెలిసినప్పటి నుంచి నా యోగక్షేమాల గురించి ఆందోళన చెందుతూ నేను సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి కావాలని ప్రతి ఒక్కరూ ఆశించారు. రాజకీయ, సినీ, సామాజిక ప్రముఖులు, మీడియా ప్రతినిధులు నేను క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. సందేశాలు పంపారు. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్, బెడ్ల కొరత ఏర్పడటం దురదృష్టకరం. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. భౌతికదూరం పాటించాలి' అని పవన్ కళ్యాణ్ అన్నారు.


Next Story

RELATED STORIES