Pawan Kalyan : పవర్ చూపించిన పవన్ కళ్యాణ్.. టీడీపీ ఎమ్మెల్యేపై ఆగ్రహం

Pawan Kalyan : పవర్ చూపించిన పవన్ కళ్యాణ్.. టీడీపీ ఎమ్మెల్యేపై ఆగ్రహం
X

కాకినాడ పర్యటనలో తన పవరేంటో చూపించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. అక్రమ రేషన్ బియ్యం యధేచ్చగా షిప్ నుంచి తరలిపోతుంటే ఏం చేస్తున్నారని జిల్లా అధికారులు, పోర్టు అధికారులను ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. పోర్ట్ ఆఫీసర్ ధర్మ శాస్త్ర, డీఎస్పీ రఘు వీర్,సివిల్ సప్లై డీ ఎస్ ఓ ప్రసాద్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. టిడిపి ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై సీరియస్ అయ్యారు. మీరు సరిగా ఉంటే రైస్‌ ఎలా వస్తుంది.. మీరు కూడా కాంప్రమైజ్‌ అయితే ఎలా.. అందుకేనా మనం పోరాటం చేసింది అంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు.

కాకినాడ పోర్ట్ నుంచి ఇంత భారీగా బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులను నిలదీశారు జనసేనాని.ప్రతిసారి ప్రజాప్రతినిధులు నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితేగాని ఆపలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం అక్రమ రవాణాలో ఎవరు ఉన్నా, ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోర్టు వద్ద సముద్రంలో ప్రయాణించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రేషన్ బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ నౌక వద్దకు సముద్రంలో ప్రత్యేక బోట్ లో వెళ్లారు. నౌకలో ఉన్న 38 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరు సరఫరా చేశారని అధికారులను ఆరా తీశారు.

Tags

Next Story