పవన్ వారాహి పూర్తి షెడ్యూల్ ఇదే..!

పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సర్వం సిద్ధమైంది.. అన్నవరం నుంచి వారాహి యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నవరం చేరుకోనున్నారు. సత్యగిరి కొండపై పల్లవి గెస్ట్ హౌస్‌లో రాత్రికి బస చేస్తారు.. రేపు ఉదయం సత్యదేవుని సన్నిధిలో వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు... తొలిరోజు యాత్రలో భాగంగా రేపు సాయంత్రం కత్తిపూడిలో బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాలతో పవన్ కళ్యాణ్ మమేకం కానున్నారు. ప్రజల కష్టాలు, బాధలు తెలుసుకునేందుకు 'జనవాణి' నిర్వహించున్నారు. అన్నవరం నుంచి నరసాపురం వరకు షెడ్యూల్ ఖరారైంది. రేపు కత్తిపూడిలో పవన్ తొలి బహిరంగ సభలో పాల్గొంటారు. జూన్ 16న పిఠాపురంలో వారాహి యాత్ర, సభ ఉంటుంది. 18న కాకినాడలో.. 20న ముమ్మిడివరంలో... 21న అమలాపురంలో.. 22న పి.గన్నవరం నియోజకవర్గం మీదుగా.. వారాహి యాత్ర, రాజోలు నియోజకవర్గం మకిలిపురంలో.. 23న నరసాపురంలో వారాహి యాత్ర, సభ ఉంటుంది.
పవన్ కళ్యాణ్ టూర్‌కు సంబంధించి సమాచారం మాత్రమే ఇచ్చారని… మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా షెడ్యూల్ కావాలని కోరుతున్నారు. ఐతే.. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు.. అన్నవరం ఈవో చంద్రళశేఖర్ ఆజాద్ రెండ్రోజుల సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ కల్యాన్ పూజలు, దర్శనం ఏర్పాట్లు చేసేదెవరనే సందేహం తలెత్తింది. ఈ బాధ్యతల్ని ఈవో.. సహాయ కమిషనర్ రమేష్‌బాబుకు అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ అన్నవరం రాకపై అధికారులకు సమాచారం లేదన్న వాదన కూడా విన్పిస్తోంది. అటు.. పవన్ అన్నవరం వస్తున్నందుకు బందోబస్తు కావాలని... ఈవో పోలీసుల్ని లిఖితపూర్వకంగా కోరడం విశేషం. ఈ పరిణామాల నేపథ్యంలో.. ఇదంతా రాజకీయ కుట్రంటూ వీర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అటు వారాహి యాత్రకు సర్వం సిద్ధమైన నేపథ్యంలో మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సీని ప్రముఖులు పాల్గొన్నారు. డైక్టర్ హరీష్ శంకర్ తో పాటు పలువురు పాల్గొని వారహి యాత్రకు మద్దతు తెలిపారు. వారాహి పాదయాత్ర విజయవంతం కావాలని ఈ సందర్భంగా సినీ ప్రముఖులు ఆకాంక్షించారు.
ఇక ఏపీలో ముందస్తు ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. డిసెంబర్‌లో తెలంగాణతో పాటు ఏపీకి ఎన్నికలు జరగొచ్చన్నారు పవన్ కల్యాణ్. గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో హోమం అనంతరం తెలంగాణ రాష్ట్ర నేతలతో సమావేశంయ్యారు పవన్ కల్యాణ్. ఈ సందర్బంగా మాట్లాడిన పవన్.... డిసెంబర్‌లో తెలంగాణతో పాటు ఏపీలోనూ ఎన్నికలు జరగుతాయన్నారు. తెలుగురాష్ట్రాలు ఉమ్మడిగా కలిసి ఎన్నికలకు వెళ్తాయన్నారు. పొత్తులపైనా స్పష్టత ఇచ్చారు పవన్ కల్యాణ్. కుదిరితేనే పొత్తులకు వెళ్తామని లేదంటూ ఒంటరి పోరు తప్పదని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com