నేడు పలు నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ పర్యటన

నేడు పలు నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ పర్యటన
X

నివర్ తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటల్ని పరిశీలించనున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ఇవాళ కృష్ణా జిల్లాలోని కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు, అవనిగడ్డ ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారు. పార్టీ నేతలతో కలిసి క్షేత్రస్థాయిలో పంటనష్టాన్ని పరిశీలిస్తారు. అకాలవర్షాలతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో వారిలో అండగా ఉంటామని జనసేన ప్రకటించింది. ఈనేపథ్యంలోనే ఇవాళ పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు పవన్ కల్యాణ్.

Tags

Next Story