వైసిపి రౌడీలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్..

వైసిపి రౌడీలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్..
X

ఏపీలో రోజురోజుకూ వైసిపి రౌడీ మూకల అల్లర్లు మరీ ఎక్కువైపోతున్నాయి. ఎంత దారుణంగా అంటే.. ప్రభుత్వ వర్గాలనే బెదిరిస్తున్నారు. రాబోయేది తమ ప్రభుత్వమే అని ఏమైనా అటు ఇటు చేస్తే తాము వచ్చాక విధ్వంసమే సృష్టిస్తామంటూ బెదిరిస్తున్నారు. వైసిపి రౌడీలను పోలీసులు గానీ ఇతర అధికారులు గాని ప్రశ్నిస్తే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు అంట. ఈ విషయాలను సదురు అధికారులే ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నారు. ఈ విషయాలపై తాజాగా పవన్ కళ్యాణ్ సీరియస్ గా స్పందించారు. వైసిపి రౌడీ మూకల అంతు చూస్తామంటూ తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం శాంతి కోసమే ప్రయత్నిస్తుందని.. ఏపీలో అశాంతి సృష్టించాలని చూస్తే రౌడీ అనే పదం వినిపించకుండా చేస్తామన్నారు.

ఏపీలో ఉన్న రౌడీలకు కూడా యూపీలో యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తామన్నారు. అలా చేస్తే గానీ వైసీపీ రౌడీ మూకలకు బుద్ధి రాదని చెప్తున్నారు. అరాచకాలు ఎక్కువ అవుతే కచ్చితంగా జైల్లో వేస్తామని తేల్చి చెప్పారు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే ఊరుకునేది లేదని.. వైసిపి ఆగడాలను తుద ముట్టిస్తామని ప్రకటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తమ్ముడు బెదిరిస్తే భయపడి పోతాం అనుకోవడం వైసీపీ పొరపాటు అని.. చట్టాలను గౌరవిస్తున్నాం కాబట్టే ఇంకా లైన్ దాటకుండా పరిపాలన చేస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం ఎప్పుడు కూడా చట్టాలను అతిక్రమించదని.. అలాగని తప్పులు చేస్తున్న వారిని విడిచిపెట్టదని తెరిచి చెప్పారు పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ చెప్తుంది కూడా నిజమే కదా. ఏపీలో ఇప్పుడు వైసీపీ రౌడీ మూకలు ఎలా రెచ్చిపోతున్నారో చూస్తున్నాం. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అధికారులను జైల్లో వేస్తామని చెబుతున్నారు. ఇంకొందరు అయితే పిపిపి విధానంలో పెట్టుబడులు పెట్టిన వారిని అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏపీవ్యాప్తంగా రౌడీలను పెంచి పోషించారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలా కాదు. రౌడీ అనే పదం వినిపించకుండా ఏరీపారేస్తున్నారు.


Tags

Next Story