Pawan Kalyan : బుద్ధి మార్చుకోండి.. వైసీపీకి పవన్ తీవ్ర హెచ్చరిక

Pawan Kalyan : బుద్ధి మార్చుకోండి.. వైసీపీకి పవన్ తీవ్ర హెచ్చరిక
X

గత ఐదేళ్లుగా వైసీపీ అధికారంలో ఉండి సాగించిన అరాచకకాండకు హద్దు అదుపే లేకుండా పోయింది. నిండు అసెంబ్లీలో మహిళలను అవమానించడం, ప్రతిపక్షాలను బూతులు తిట్టడం మాత్రమే కనిపించింది తప్ప సమస్యలపై మాట్లాడింది లేదు. ఇక సోషల్ మీడియాలో వైసీపీ ఏ స్థాయిలో వ్యక్తిగతంగా ట్రోల్స్, విమర్శలు చేసిందో మనం చూసాం. ఆ దారుణాలను తట్టుకోలేక ఏపీ ప్రజలు వైసీపీని అత్యంత ఘోరంగా ఓడగొట్టారు. అధికారం పోయినా సరే వైసీపీ తీరు అస్సలు మార్చుకోవట్లేదు. సోషల్ మీడియాలో ఇప్పటికీ అధికార పార్టీల నేతలపై ట్రోల్స్, బూతులే కనిపిస్తున్నాయి. ఇదే విషయంపై ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ తీవ్రంగా హెచ్చరించారు. అయినా సరే వైసీపీ తీరు మారట్లేదు. దీంతో తాజాగా రాజోలులో జరిగిన సభలో మరోసారి వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు. అధికారం పోయినా సరే వైసీపీ నేతలు తమ బుద్ధి మార్చుకోవట్లేదని.. వారు సోషల్ మీడియాలో ఇప్పటికీ అదే బూతులు మాట్లాడుతూ, ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

వైసిపి తీరు కచ్చితంగా మార్చుకోవాల్సిందే అని.. ఇలాగే ఉంటే ఏపీలో ఫ్యాను పార్టీ అనేది ఉండకుండా ప్రజలే తీర్పులు ఇస్తారని తేల్చి చెప్పారు. తాను చంద్రబాబు నాయుడులా సౌమ్యుడిని కాదని.. తప్పు చేస్తే కచ్చితంగా శిక్షించే తత్వం తనది అంటూ చెప్పారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ మంచితనాన్ని మాత్రమే చూశారని.. ఇలాగే ఉంటే పవన్ కళ్యాణ్ కోపాన్ని కూడా చూస్తారు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా అక్షరాల నిజమే. వైసిపి నేతలు సోషల్ మీడియాలో ఏ విధంగా ఇప్పటికీ మహిళలపై ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారో మనం చూశాం. ఇలాంటి అరాచకాలు చూడలేకనే ఏపీ ప్రజలు ఓడగొట్టినా సరే వైసీపీకి బుద్ధి రావట్లేదు. జగన్ డబ్బులు ఇచ్చి మరి విదేశాల్లో ఉండే కొందరు వ్యక్తులతో ఇలాంటి దారుణాలకు తెరతీస్తున్నారు. విదేశాల్లో ఉండే ఇలాంటి అరాచక శక్తులు ఇండియాకు వస్తే పోలీసులు తాటతీస్తూ అరెస్టు చేస్తున్న సంగతి కూడా మనం రీసెంట్ గా చూస్తున్నాం.

గతంలో ఒకసారి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇలాగే రెచ్చిపోతే అవసరమనుకుంటే హోం శాఖ తాను తీసుకుంటే పర్యవసనాలు వేరే విధంగా ఉంటాయని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా సభలో మరోసారి అదే విషయాన్ని గుర్తు చేసుకున్నారు పవన్. పర్యవసానాలు అత్యంత బలంగా ఉంటాయని చెప్పారు. పవన్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఈసారి బలమైన యాక్షన్ తీసుకునేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు కూడా సోషల్ మీడియాలో మహిళలను అవమానిస్తే ఊరుకునేది లేదని పదేపదే హెచ్చరిస్తూనే వస్తున్నారు. కానీ వైసీపీ తీరు మార్చుకోకపోవడంతో దీనిపై ప్రభుత్వం గట్టిగానే యాక్షన్ తీసుకుని చాన్స్ ఉంది.


Tags

Next Story