Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కు సిరిసిల్ల మగ్గం కళాకారుడి బహుమతి

Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కు సిరిసిల్ల మగ్గం కళాకారుడి బహుమతి
X

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు మరో అద్భుత కళాఖండాన్ని తయారు చేశాడు. సిరిసిల్ల నేతన్న వెల్ది హరిప్రసాద్ చేనేత మగ్గంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్ర పటాన్ని చేశారు. అంతేకాకుండా చేనేత వృత్తి ఉట్టిపడేలా చిన్న మగ్గాన్ని తయారుచేసి, దానిపై తాను మగ్గంపై నేసిన పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్న వస్త్రాన్ని ఉంచాడు. మగ్గంపై పవన్ కల్యాణ్ చిత్రం, జ్ఞాపికను తయారు చేసి పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.

ఈ మగ్గం జ్ఞాపికను ఐదు రోజులు శ్రమించి తయారుచేసి తను ప్రతిభను చాటుకున్నాడు. హరి ప్రసాద్ గతంలో కూడా కళాఖండాలను తయారు చేశాడు. ఇటీవల అయోధ్య రామాలయానికి చీరపై శ్రీ రాములవారి రూపాన్ని రామాయణం ఇతివృత్తాలు 10 వచ్చేలా నేసి బండి సంజయ్ చేతుల మీదుగా ఈ చీరను ఆవిష్కరించాడు. దానిని చూసిన బండి సంజయ్ ప్రశంసలతోపాటు అభినందించారు.

అలాగే ఆ మధ్య జీ 20 లోగో చేనేత మగ్గంపై నేసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్ననలు కూడా పొందారు. స్వయంగా ముచ్చటగా మూడోసారి ఢిల్లీ వేదికగా జరిగిన దేశ ప్రధాని ప్రమాణ స్వీకారానికి ఆయనకు ఆహ్వానం కూడాలభించింది. గతంలో ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి. సిరిసిల్లకు వచ్చినప్పుడు సిరిసిల్ల గుర్తుగా చిటికె వేస్తే నడిచే మగ్గాన్ని తయారు చేసి జ్ఞాపకంగా అందించాడు.

Tags

Next Story