పెద్దిరెడ్డి ఫ్యామిలీ కబ్జా.. పవన్ పంజా..

మాజీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అడవిని ఆక్రమించేసిన దృశ్యాలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా హెలికాప్టర్ లో వెళ్లి బయట ప్రపంచానికి చూపించారు. మొన్న జరిగిన మంత్రుల మీటింగ్ లో సీఎం చంద్రబాబుకు మంత్రులకు ప్రజెంటేసన్ కూడా ఇచ్చారు. అడవి ఆక్రమణకు గురైన విషయంపై వివరాలు ఇవ్వాలని అధికారులకు పవన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం.. పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, ఇంద్రమ్మ, మిథున్ రెడ్డి, ద్వారకానంద రెడ్డి పేరు మీదున్న ఆక్రమణలు మొత్తం 32.63 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని తేల్చారు. ఈ కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టేశారు. ఇందులో మామిడి తోటలు కూడా పెట్టారు.
అయితే పవన్ కల్యాణ్ ఇలా విజువల్స్ తో సహా చూపిస్తే.. దీనిపై వైసీపీ నాయకులు అప్పుడే రకరకాల ప్రచారాలు మొదలు పెట్టేశారు. ఇక తాజాగా మిథున్ రెడ్డి ఎక్స్ లో ఓ అందమైన కథ అల్లేశారు. ఆ 32 ఎకరాలు తమకు వారసత్వంగా వచ్చాయని.. వాటన్నింటికీ పక్కాగా పట్టాలు ఉన్నాయంటున్నారు. కానీ అవి ఏంటో మాత్రం చూపించట్లేదు. అంటే సాక్ష్యాలు చూపించకుండా కేవలం ఒక మాట అనేస్తే అయిపోతుందని వారి ఫీలింగ్. కల్లబొల్లి మాటలతో ప్రజలను నమ్మించడం వైసీపీ నేతలకు అలవాటే కదా.
ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా ఇదే చేస్తున్నారు. కేవలం ఆయనకు తోచింది అనేస్తున్నారు. అయితే నేడు పవన్ కల్యాణ్ ఆదేశాలతో ఫారెస్ట్ అధికారులు పెద్ది రెడ్డి ఫ్యామిలీ కబ్జా బాగోతాన్ని మొత్తం బయట పెట్టేశారు. ఎన్ని ఎకరాలు వారి పేరు మీద ఉన్నాయి. అక్కడ ఎన్ని ఎకరాలు అటవీ భూములు కబ్జాకు గురయ్యాయి అనేది మొత్తం బయట పెట్టారు. సాక్ష్యాలతో సహా వివరించారు. మరి మిథున్ రెడ్డి కూడా తన వద్ద పట్టాలు ఉంటే బయట పెట్టాలి కదా. సర్వే నెంబర్లు చూపించాలి కదా. అలాంటివేమీ చూపించకుండా కేవలం ప్రజలను నమ్మించడానికి ఇష్టం వచ్చిన అబద్దాలు ఆడేస్తున్నారు. అబద్దాలు ఆడటానికి కూడా ఒక హద్దు ఉండాలి గానీ.. ఏది పడితే అది మాట్లాడితే ఎలా అంటున్నారు ఏపీ ప్రజలు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

