AP : నేడే ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల విడుదల

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు విడుదల కానున్నాయి. CPS, జీపీఎఫ్, ఏపీజీఏఐ కింద కలిపి రూ.6,200 కోట్లు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం అన్నారు. బకాయిల విడుదలపై ఏపీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. మిగిలిన పెండింగ్ అంశాలపైనా సానుకూలంగా స్పందించాలని ప్రకటనలో కోరింది.
గత ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయులు వేతనాల చెల్లింపుల్లో ఇబ్బంది పడ్డారని, 25 వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రాష్ట్రంలోని పరిస్థితులు ఇబ్బందులు మీద అవగాహనతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పూర్తిగా సహకరించాయని, తొమ్మిది నెలలు దాటినా కూడా ఉద్యోగుల సమస్యలన్నీ ఎక్కడి ఒక్కడే ఉన్నాయని గురువారం ఏపీ జేఏసీ నాయకులు చీఫ్ సెక్రటరీకి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని పాస్టర్లకు మూడు నెలల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,427మంది పాస్టర్లకు రూ.12,82,78,000 నిధులు విడుదల చేస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రభుత్వం గత ఏడాది మే నెల నుంచి పాస్టర్లకు రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తున్న సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com