AP : పాపికొండల యాత్రకు అనుమతులు

AP : పాపికొండల యాత్రకు అనుమతులు
X

ఉభయ గోదావరి జిల్లాల్లో టూరిజం సందడి పెరిగింది. టెంపుల్ టూరిజంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాల సందర్శన యాత్రను ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. కోరుకొండ... అన్నవరం... పిఠాపురం సహా ఆరు ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శనకు ఒక్కరోజు పర్యటనకు ఒక్కరికి వెయ్యి రూపాయలు టికెట్‌గా నిర్ణయించారు. మరోవైపు గోదావరి వరదల కారణంగా జులై నెలలో నిలిపివేసిన పాపికొండల విహారయాత్ర తిరిగి ప్రారంభమైంది. దేవీపట్నం మండలం గండి పోచమ్మ ఆలయం నుంచి పర్యాటక బోట్లకు ట్రయల్ రన్ నిర్వహించి పాపికొండలకు అనుమతి ఇచ్చారు.

Tags

Next Story