Perni Nani : మోహన్ బాబు పిలిస్తేనే వాళ్ల ఇంటికి వెళ్లా : పేర్ని నాని

Perni Nani : మంత్రి పేర్ని నాని హైదరాబాద్‌లో సినీ నటుడు మోహన్‌బాబుతో భేటీ హాట్ టాపిక్‌గా మారింది.. శుక్రవారం మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహం సందర్భంగా హైదరాబాద్ వెళ్లిన మంత్రి పేర్ని నాని.. ఆ తర్వాత మోహన్‌బాబు ఇంటికి వెళ్లి ఆయన్ను కలిశారు.. ఈ భేటీలో సినీ పరిశ్రమకు చెందిన అంశాలపై చర్చ జరిగినట్లుగా ప్రచారం జరిగింది. టాలీవుడ్ సమస్యలపై ప్రభుత్వ వైఖరి, సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను మోహన్‌బాబుకు వివరించినట్లు వార్తలు వచ్చాయి.
తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో సీఎం జగన్‌తో చిరంజీవి బృందం భేటీ జరిగిన మరుసటిరోజే పేర్నినాని, మోహన్‌బాబు భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఈ భేటీపై మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా స్పందించారు. అయితే, ఈ సమావేశంపై అనేక రకాలుగా చర్చలు నడిచాయి.. దీంతో మంత్రే స్వయంగా స్పందించారు. మోహన్‌బాబు ఆహ్వానం మేరకే తాను ఆయన ఇంటికి వెళ్లానని పేర్ని నాని చెప్పుకొచ్చారు.
గురువారం నాటి చర్చల వివరాలను తాను వివరించడానికి వెళ్లలేదన్నారు. మీడియాలో వచ్చిన వార్తలను పేర్ని నాని ఖండించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com