మద్యం కొనేందుకు డబ్బులు ఇవ్వలేదని నిద్రిస్తున్న తల్లిపై పెట్రోల్ పోసి..

మద్యం కొనేందుకు డబ్బులు ఇవ్వలేదని నిద్రిస్తున్న తల్లిపై పెట్రోల్ పోసి..
అమ్మా ఆకలేస్తుంది అంటే అన్నం పెడుతుంది కానీ మద్యం తాగుతానంటే ఏ తల్లి మాత్రం ఒప్పుకుంటుంది.

అమ్మా ఆకలేస్తుంది అంటే అన్నం పెడుతుంది కానీ మద్యం తాగుతానంటే ఏ తల్లి మాత్రం ఒప్పుకుంటుంది. అమ్మ ప్రేమ ఆ పని చేయనివ్వదు.. ఆ విషయాన్ని ఆ కొడుకు అర్థం చేసుకోలేకపోయాడు.. అంతే ఆగ్రహంతో అమ్మను చంపేశాడు.

అమ్మ మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదని ఆగ్రహంతో ఇంటి నుంచి వెళ్లిన ప్రణీత్.. మూడు లీటర్ల పెట్రోల్‌ క్యాన్ తో తిరిగి వచ్చాడు. మంచంపై నిద్రిస్తున్న తల్లిపై పోసి నిప్పంటించాడు. మంటలకు తాళలేక ఆమె అరిచిన అరుపులకు కూడా అతడి హృదయం కరగలేదు. ఆ తల్లి మంటల్లో మాడి మసైపోయింది.

ఆంధ్రప్రదేశ్‌అనంతపురం జిల్లాకు చెందిన ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంబదూరు గ్రామానికి చెందిన ప్రణీత్ మద్యంతో పాటు పలు వ్యసనాలకు బానిసయ్యాడు. అతడు తన తల్లి సుజాతతో ప్రతి రోజు గొడవపడేవాడు. ఈ క్రమంలో మద్యం కొనేందుకు తల్లిని డబ్బులు అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో కోపంతో ఊగిపోయాడు.. అమ్మపై పెట్రోల్ పోసి ఆమె మరణానికి కారణమయ్యాడు.

కళ్యాణదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story