MODI: మోదీ తెలుగు ప్రసంగం... చంద్రబాబు నవ్వులు

అమరావతి పునఃప్రారంభ సభలో ప్రధాని మోదీ ఒకవైపు కీలక ఉపన్యాసం చేస్తుండగా... మరోవైపు సీఎం చంద్రబాబు ఫుల్ ఖుషీగా కనిపించారు. ‘నా అనుభవంతో చెప్తున్నా, ఈ దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లు చేయలన్నా, వేగంగా చేయలన్నా, క్వాలిటీతో చేయలన్నా చంద్రబాబుని మించివారు లేరు’ అంటూ మోదీ ప్రశంసలు కురిపించారు. మోదీ మాట్లాడినంత సేపు చంద్రబాబు ఆసక్తితో వింటూ.. చిరునవ్వులు చిందించారు. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ కూడా చిరునవ్వులు చిందించారు. మోదీ తెలుగు ప్రసంగంపై హర్షం వ్యక్తమవుతోంది.
రఘరామపై మోదీ ప్రశంసలు
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘరామ కృష్ణరాజును ప్రధాని మోదీ ప్రశంసించారు. గన్నవరం విమానాశ్రయం దగ్గర వీడ్కోలు సమయంలో రఘరామ ఫైటర్ అంటూ పొగిడారు. రఘరామ పోరాటయోధుడని ఆయన డిప్యూటీ స్పీకర్ కావటం సంతోషమని మోదీ అభినందించారు. రఘురామ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు.
మరోసారి ఏపీకి రానున్న ప్రధాని మోదీ
ప్రధాని మోదీ మరోసారి ఏపీకి రానున్నారు. శుక్రవారం అమరావతి పునఃప్రారంభోత్సవ సభకు వచ్చిన మోదీ.. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు(జూన్ 21)న తాను ఏపీకి వస్తానని స్వయంగా ప్రకటించారు. సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు తాను యోగా దినోత్సవం రోజున ఏపీలో పర్యటిస్తానన్నారు. యోగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.**
నన్ను కలవడానికి రావా? .. లోకేశ్‌తో ప్రధాని సరదా సంభాషణ
అమరావతి సభ వేదికపై ప్రధాని మోదీ.. నారా లోకేశ్‌తో సరదా వ్యాఖ్యలు చేశారు. ‘నీకెన్ని సార్లు చెప్పాలి.. నన్ను కలవడానికి రావా? ’ అని లోకేశ్‌తో అన్నారు. గత పర్యటనలోనూ ఇదే అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఇందుకు బదులిచ్చిన లోకేశ్.. త్వరలోనే కుటుంబ సమేతంగా ఢిల్లీకి వస్తానని మోదీతో చెప్పారు.
మోదీ సభ సమీపంలో భారీ అగ్నిప్రమాదం
అమరావతిలో నిర్వహించిన మోదీ సభకు 3 కిలోమీటర్ల దూరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా, తుళ్ళూరు మండలం లోని మందడం గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పంట పొలాల్లో ఉన్న పైపులకు మంటలు అంటుకుని ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com