జగన్ పై మోడీ ఫోకస్.. ఇక రణరంగమే..

జగన్ పై మోడీ ఫోకస్.. ఇక రణరంగమే..
X

ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు పాలనపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. పాలన అద్భుతంగా ఉందని, దేశవ్యాప్తంగా ఏపీకే ఎక్కువగా పెట్టుబడులు వెళుతున్నాయంటూ అభినందించారు. ఏపీలో కూటమి సమన్వయంతో ముందుకు వెళుతుందని.. చంద్రబాబు నాయుడుతో పని చేయడం మంచిదని బిజెపి ఎంపీలకు సూచించారు. ఇదే టైంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. వైసిపి చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని.. సోషల్ మీడియాలో మరింత బలంగా పనిచేయాలని బిజెపి ఎంపీలను ఆదేశించారు. జగన్ పాలనలో జరిగిన అక్రమాలు, అవినీతిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆ పార్టీకి మరో అవకాశం ఇవ్వకుండా పనిచేయాలని చెప్పారు. దీంతో వైసీపీలో అలజడి మొదలైంది. ఎందుకంటే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జగన్ మీద ఫైర్ అయ్యారంటే ఆ పార్టీ చేస్తున్న అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోవచ్చు.

పైగా సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలు అన్ని ఇన్ని కావు. ఏది పడితే అది చెప్పేస్తూ.. కూటమి ప్రభుత్వంపై బురద జల్లడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది వైసిపి బ్యాచ్. ఈ విషయం ప్రధానమంత్రి దాకా వెళ్ళింది అంటే.. ఆ తప్పుడు ప్రచారాలు హద్దులు దాటిపోయాయి అనే విషయం మనకు ఇక్కడ అర్థం అవుతుంది. నిజమే కదా వైసిపి కూటమి ప్రభుత్వం మీద ఎన్ని రకాల బురదజల్లే కార్యక్రమాలు తీసుకుంటుందో చూస్తూనే ఉన్నాం. ఆ పార్టీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే వాటిని కవర్ చేయడానికి కూటమి మీద లేనిపోని ఆరోపణలు చేస్తోంది. ఏదో ఒక పసలేని కార్యక్రమాన్ని ఎత్తుకుంటూ పబ్బం గడుపుతోంది. గతంలో కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే అధికారంలోకి వచ్చింది వైసీపీ పార్టీ.

కానీ ఇప్పుడు ఆ ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వైసిపి చేసిన అరాచకాలు అలాంటివి. ఆ పార్టీ హయాంలో ఏపీ 50 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయింది. మరో బీహార్ రాష్ట్రంలో ఏపీని తయారు చేసింది వైసిపి. కానీ ఇప్పుడు కూటమి వచ్చాక ఆ పరిస్థితులు అన్నీ పోతున్నాయి. పెట్టుబడులు కుప్పలు తిప్పలుగా వస్తున్నాయి. ఏపీకి ప్రపంచ స్థాయి బ్రాండ్ ఏర్పడుతోంది. సంక్షేమం అన్ని వర్గాలకు సమపాళ్లలో అందుతుంది. మరి ఇంత చేస్తున్నప్పుడు ప్రజలకు వాటిని వివరించడంతోపాటు వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు కచ్చితంగా కౌంటర్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు స్వయంగా మోడీ ఆదేశించారు కాబట్టి ఇక నుంచి వైసీపీకి రణరంగం మొదలైనట్టే అంటున్నారు కూటమినేతలు.


Tags

Next Story