Chandrababu Naidu : చంద్రబాబు పాలనపై ప్రధాని ప్రశంసలు.. షాక్ లో వైసీపీ

Chandrababu Naidu : చంద్రబాబు పాలనపై ప్రధాని ప్రశంసలు.. షాక్ లో వైసీపీ
X

సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి పాలన ఎంత బాగుందో ఇతర రాష్ట్రాల నేతలే పొగుడుతున్నారు. అయినా సరే వైసీపీ వాటిని ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ప్రశంసించారు. చంద్రబాబు నాయుడు పాలన అద్భుతంగా ఉందని.. దేశంలో ఎక్కువగా పెట్టుబడులు ఏపీకే వెళ్తున్నాయని పొగిడారు. ఈ రెండూ కూడా కూటమి పాలనకు మంచి మైలేజ్ ఇస్తున్నాయి. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ ఇలా ఏ ప్రభుత్వాన్ని కూడా పెద్దగా పొగడరు. చంద్రబాబు పాలన నిజంగానే బాగుంది కాబట్టే ఆయన పొగిడారని అందరికీ అర్థం అవుతోంది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల ఎంపీలతో ప్రధాని ఇలా అరగంట పాటు భేటీ అయ్యారు. అందులో భాగంగానే ఇలా పొగిడారు.

అదే టైమ్ లో వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు. వైసీపీ పార్టీ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవాలన్నారు. ఆ పార్టీ సోషల్ మీడియాలో అడ్డగోలుగా ప్రచారం చేస్తోందని.. దాన్ని తిప్పి కొట్టి ప్రజలకు అసలు నిజాలను వివరించాలన్నారు ప్రధానమంత్రి మోడీ. దీంతో వైసీపీకి పెద్ద షాక్ తగిలినట్టే అయిపోయింది. ఎందుకంటే వైసీపీ నేతలు కూటమి పాలనపై బురద జల్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. కానీ వైసీపీ ఎన్ని కుట్రలు చేస్తున్నా చంద్రబాబు పాలనకు పెద్ద స్థాయి నేతల నుంచే ప్రశంసలు వస్తున్నాయి.

గూగుల్ డేటా సెంటర్ పై వైసీపీ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసిందో కూడా మనం చూశాం. కానీ ప్రధాని మోడీ స్వయంగా దాని గొప్పతనం గురించి వివరించేసరికి వైసీపీ నోర్లు మూత పడ్డాయి. ఇప్పుడు చంద్రబాబు పాలనను ప్రధాని స్వయంగా మెచ్చుకుంటూ పెట్టుబడులపై ప్రత్యేకంగా కామెంట్ చేయడంతో వైసీపీ నేతలకు మింగుడు పడట్లేదు. తాము ఇన్ని తప్పుడు ప్రచారాలు చేస్తుంటే.. ప్రధాని ఒక్క మాటతో వాటన్నింటికీ చెక్ పెట్టేస్తే ఎలా అని తెగ ఫీల్ అయిపోతున్నారంట వైసీపీ బ్యాచ్. ప్రధాని మోడీ నిజంగా పనిచేసిన వారికి కచ్చితంగా అభినందిస్తుంటారు. తన పార్టీ వాళ్లనే కాదు వేరే పార్టీ నేతలను కూడా ఓపెన్ గా ప్రశంసించడం చాలా సార్లు చూశాం. ఇప్పుడు ఆయన ప్రశంసలు చంద్రబాబు పాలనకు తిరుగులేదని నిరూపించాయని అంటున్నారు కూటమినేతలు.


Tags

Next Story