CBN: జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు ముద్ర

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఛండీగఢ్ లో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల విస్తృత స్థాయి సమావేశం ఆసక్తిని రేపింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ భేటీ రాజకీయ అనుబంధాలను మరింత బలోపేతం చేసింది ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్ నాథ్ సింగ్ జేపీ నడ్డా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వంటి కీలక నేతలు కూడా హాజరయ్యారు. ఈ భేటీలో ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగింది. త్వరలో జరగబోయే మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది.
ఒకే వేదికపై.
హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టడం రెండో సారి. పంచకులలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనతో ప్రమాణం చేయించారు. హర్యానా ఎన్నికల్లో బీజేపీ 90 స్థానాలకు గాను 48 స్థానాల్లో గెలుపొంది సాధారణ మెజార్టీని సాధించింది. నాయస్ సింగ్ సైని ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాలకు చెందిన 18 మంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు. దేశంలోని ప్రముఖ నేతలంతా ఒకే చోట చేరడంతో పంచకులలో సందడి నెలకొంది. ఏపీ నుంచి ఎన్డీఏలో కీలక నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్డీఏలో భాగంగా ఉన్నామని ఈ ఈ విజయోత్సవంలో పాల్గొనడానికి వచ్చామని అక్కడి మడియాకు పవన్ కల్యాణ్ తెలిపారు.
చంద్రబాబుకే పెద్దపీట
ఎన్డీఏ కూటమిలో అత్యంత కీలక పార్టీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యధిక ప్రాధాన్యం లభించింది. ఆయనకు వేదికపై అమిత్ షా, జేపీ నడ్డాల మధ్యలో సీటు ఏర్పాటు చేశారు. ఇలా సీటింగ్ ఏర్పాటు చేయడం ద్వారా వారు చంద్రబాబుకు ఎంత విలువ ఇస్తున్నామో చెప్పినట్లయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత ఎన్డీఏ పార్టీలన్నీ గ్రూపు ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రధాని మోదీ సహా కీలక నేతలందరూ ఈ ఫోటో కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ కూడా చంద్రబాబుకు ప్రదాని మోదీ పక్కన స్పేస్ రిజర్వ్ చేశారు. ఈ పరిణామాలన్నీ ఎన్డీఏలో టీడీపీకి లభిస్తున్న ప్రాధాన్యతను గుర్తు చేస్తున్నాయని అంటున్నారు.
ఉల్లాసంగా మోదీ..
ఈ సమావేశంలో ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో ఎంతో ఉల్లాసంగా మాట్లాడారు. ఇది భవిష్యత్తులో ఎన్డీయే గూటిలో మరింత ఐక్యతను పెంచేలా ఉంది. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రధాని మోదీతో కలిసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాను చుట్టేస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com