CM Chandrababu : ఆగిన పోలవరం ప్రాజెక్టు పనులు.. చంద్రబాబు ట్రబుల్ షూట్

CM Chandrababu : ఆగిన పోలవరం ప్రాజెక్టు పనులు.. చంద్రబాబు ట్రబుల్ షూట్
X

పోలవరం ప్రాజెక్టు డీవాల్ నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఈ నెల 18న పూజలు చేసి ఈ పనులు మొదలుపెట్టారు. టీ 5 కాంక్రీటుతో ప్రారంభించిన పనులు నిలిపివేయాలని కేంద్ర జల సంఘం ఆదేశాలు జారీ చేసింది. టి 16 కాంక్రీటుతో పనులు చెయ్యాలని అంతర్జాతీయ నిపుణులు ఆదేశించారు. ప్రస్తుతం దావోస్‌లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ ఉన్న కేంద్ర జల శక్తి మంత్రి CR పాటిల్‌తో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో టి 5 కాంక్రీటుతో చేసిన నిర్మాణం గోదావరి వరదలకు దెబ్బతిందని.. ఇప్పుడు మళ్లీ అదే టి 5 కాంక్రీటుతో బావర్ సంస్థ నిర్మించడంతో సంసిద్ధత నెలకొంది.

Tags

Next Story